పాలకొల్లు:డిసెంబర్,3(తెలుగు న్యూస్ పవర్) ప్రతి ఏటా డిసెంబర్ 3 న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుపుకుంటారు. ఐక్యరాజ్యసమితి 1992లో ఈరోజు దివ్యాంగుల కోసం అధికారికంగా ప్రకటించింది. అప్పటినుంచి ప్రపంచ దేశాలన్నీ ఈ సామాజిక బాధ్యత తీసుకుని ముందుకు నడుస్తున్నాయి. వికలాంగులను వేరుగా చూడకుండా, వారు కూడా మనలో ఒకరిగా చూడాలని ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. దివ్యాంగులు అంటే అంటే సమాజం చిన్న చూపు చూస్తుంది. అయితే ఆ భావన నిరాధారమైనది. సమాజంలో వీరిని అసహజం,అసమర్థులుగా భావించే రోజులు ఇక పోయాయి. వారికి కూడా సరియైన శిక్షణ,ప్రోత్సాహం కల్పిస్తే ఆయా రంగాల్లో రాణిస్తున్న పరిస్థితి ఇప్పుడు అందరూ గమనిస్తున్నారు. వారి సామర్థ్యాన్ని అద్భుతంగా ప్రపంచానికి ప్రదర్శిస్తున్నారు .
ఈ దినోత్సవం ఉద్దేశం,
దివ్యాంగుల యొక్క హక్కులు, వారి పట్ల గౌరవం చూపటం పై అవగాహన కల్పించడం .
వారికోసం అడ్డంకులు లేని ప్రపంచాన్ని నిర్మించడం .
విద్య,ఉద్యోగం,ఆరోగ్య సేవలో సమాన అవకాశాలు ఇవ్వడం.
ప్రభుత్వాలు ,స్వచ్ఛంద సంస్థలు కలిసి అందుబాటులో ఉన్న సదుపాయాలు మరింతగా పెంచే దిశగా పని చేయటం.
భారతదేశంలో వికలాంగులు పరిస్థితి గమనిస్తే 2.21%. వీరిలో ఏదో ఒక వైకల్యం కనిపిస్తుంది.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వికలాంగులకు వరాలు ప్రకటించారు.వారికి ప్రభుత్వ గృహ సముదాయాల్లో నేలను ఆనుకుని ఉండే గ్రౌండ్ ఫ్లోర్ కేటాయిస్తారు.

వారికి వచ్చే ప్రభుత్వ పథకాలలో సబ్సిడీ ఎస్సీ,ఎస్టీ, బీసీలకు ఇచ్చే మొత్తంతో సమానంగా సబ్సిడీఇస్తారు. వీరి కోసం ఒక డిగ్రీ కళాశాల కూడా ఏర్పాటు చేయటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగులకు ఇప్పటికే 6000 రూపాయలు పింఛన్ ప్రతినెల అందిస్తున్నారు.వీరికి బ్యాటరీతో నడిచి విద్యుత్ మూడు చక్రాలు వాహనాలు ఇస్తున్నారు.
విభిన్న ప్రతిభావంతుల ప్రపంచ దినోత్సవం సందర్భంగా, డాక్టర్ త్సవటపల్లి సత్యనారాయణమూర్తి, బాబ్జి చైర్మన్ గాగల,పాలకొల్లు అంజలి మానసిక వికలాంగుల, దివ్యాంగుల పరిశోధన మరియు పునరావాస కేంద్రం, గ్రామీణ ప్రాజెక్టు వద్ద మండల న్యాయ సేవ సాధికార కమిటీ చైర్మన్, న్యాయమూర్తి లక్ష్మీ లావణ్య వారి ఆదేశాల మేరకు రిటైనర్ న్యాయవాదులు కర్ని యోహాన్ పెంకీ పూర్ణ చంద్ర హాజరయ్యారు .ఈ పాఠశాల నిర్వహణ పట్ల వారు ముగ్ధులయ్యారు.దేవుని బహుమానంగా దివ్యాంగులను కొలుస్తున్నారని, వారి సేవలను ప్రశంసించారు,ఈ సందర్భంగా పాలకొల్లు లయన్స్ ఫెమీనా వారు ఇచ్చిన బహుమతులను విజేతలకు అందజేశారు. అనంతరం వారికి బిస్కెట్లు పంచారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ పివి ప్రసాద్,వారి సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

కొత్తపల్లి జానకిరామ్ ఆధ్వర్యంలో
నర్సాపురం:డిసెంబర్,3 (తెలుగు న్యూస్ పవర్) నర్సాపురం నియోజకవర్గ మదర్ థెరిసా దివ్యాంగుల
సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం వాళ్లందర్ రేవు వద్ద గల భవనంలో జరిగింది. మాజీ శాసనసభ్యులు కొత్తపల్లి జానకిరామ్ ఈ సందర్భంగా దివ్యాంగులకు నిత్యవసర వస్తువులు, వస్త్రాలు ఇచ్చి ప్రోత్సహించి. దివ్యాంగుల పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు.
.