Telugu News Power

విశాఖలో రూ. 250 కోట్ల రూపాయలతో 5 నక్షత్రాల హోటల్.

విశాఖపట్నం: మార్చి ,21 (తెలుగు న్యూస్ పవర్. కాం) విశాఖపట్నంలోని సాగర్ నగర్–ఎండాడ సమీపంలో ప్రతిష్టాత్మక హయత్ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ శనివారం భూమి పూజ చేశారు. స్థానిక శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం నిర్మించబోతున్న, రూ.250 కోట్ల భారీ పెట్టుబడితో 3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ హోటల్, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుని వచ్చే రెండేళ్లలో అందుబాటులోకి మంత్రి తెలిపారు….

Read More

బిజెపి శిక్షణ కార్యక్రమం ప్రారంభం.

పాలకొల్లు: మార్చి, 21 (తెలుగు న్యూస్ పవర్. కామ్) దీన్‌దయాళ్ ప్రసిక్షణ అభియాన్ బీజేపీ కేడర్‌కు సమగ్ర శిక్షణ కార్యక్రమం స్థానిక క్షత్రియ కళ్యాణ మండపం లో శనివారం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా తన పార్టీ కార్యకర్తలను బలోపేతం చేయడానికి “దీన్‌దయాళ్ ప్రసిక్షణ అభియాన్” పేరుతో భారీ శిక్షణ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ తాత్వికవేత్త దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పేరు పెట్టారు.ఈ శిక్షణ అభియాన్ ప్రధాన లక్ష్యం పార్టీ కేడర్‌కు సిద్ధాంతపరమైన అవగాహనతో పాటు నాయకత్వ…

Read More

కార్మిక మంత్రి కాపవరం పర్యటన.

పాలకొల్లు: మార్చి, 21(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్ శనివారం స్థానిక కాపవరం గ్రామంలో పర్యటించారు. మాజీ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్, అంగర రామ్మోహన్రావు స్వగ్రామంలో నిర్మించిన రామాలయం ప్రారంభోత్సవ సందర్భంగా, మంత్రి సుభాష్ విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ ,టిడిపి రాష్ట్ర కార్యదర్శి, పెచ్చెట్టి బాబు, సర్పంచ్ కోలాటి రాధా, అంగర చిన్న, గూడూరి శ్రీరామ్మూర్తి తదితర గ్రామ పెద్దలు…

Read More

యువతకు కొలువులతో, కూటమి ప్రభుత్వం మేలుకొలుపు. -మంత్రి నిమ్మల రామానాయుడు

పాలకొల్లు: మార్చి,20(తెలుగు న్యూస్ పవర్. కాం) కూటమి ప్రభుత్వం యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్టు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానికంగా జరిగిన విలేకరుల సమావేశంలో శుక్రవారం మంత్రి మీడియా ప్రనిధులతో మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చి, మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్రం నుంచి 400 కంపెనీలనుభయపెట్టి తరిమేసిందన్నారు. నాడు ఉద్యోగ ఉపాధి అవకాశాలు…

Read More

నాటి ప్రభుత్వం చేసిన అప్పులు, నేటి ప్రభుత్వానికి తిప్పలు. -మంత్రి నిమ్మల విమర్శ

శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి నిర్మల యలమంచిలి, మార్చి, 20(తెలుగు న్యూస్ పవర్. కామ్) గత ప్రభుత్వం చేసిన 14 లక్షల కోట్ల అప్పుల వల్ల, నేడు అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నదని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు వెల్లడించారు. మంత్రి మండలంలో, రోడ్లు భవనాల శాఖ రూ.2.70 కోట్ల రూపాయల నిధులతో వేయనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన శుక్రవారం చేశారు. ఈ సందర్భంగా కాజ తూర్పులో జరిగిన సభలో మంత్రి…

Read More

ప్రజల కోసమే నిరంతరం పనిచేస్తున్నాను. -మంత్రి నిమ్మల రామానాయుడు

పాలకొల్లు: మార్చి, 19(తెలుగు న్యూస్ పవర్. కాం) ప్రజల కోసమే నిరంతరం పనిచేస్తున్నానని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఉగాది సందర్భంగా, ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తనకున్న అవకాశాలన్నీ, వ్యక్తిగత స్వార్థానికి వాడుకోకుండా ప్రజల కోసమే వినియోగిస్తున్నానని మంత్రి నిమ్మల వెల్లడించారు. స్థానిక బి.ఆర్.అంబే బాలికలు, ఎంఎంకెఎన్ఎమ్ విద్యార్థులకు 250 సైకిళ్ళు ఉగాది రోజున ఉచితంగా పంపిణీ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి…

Read More

ఏ పీ లో నిరుద్యోగులకు వరం- 10 వేల ఉద్యోగాలు సిద్ధం.

అమరావతి: మార్చి, 19(తెలుగు న్యూస్ పవర్.కాం) ఉగాది సందర్భంగా, ప్రభుత్వం నిరుద్యోగులకు దీపికబురు అందించింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న సుమారు 10,060 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ గురువారం విడుదల చేశారు. ప్రభుత్వం వివిధ శాఖల వారీగా ప్రకటించిన ఖాళీల వివరాలు, విద్యాశాఖలో 3004, పోలీసు శాఖలో 3057, ఉన్నత విద్య శాఖలో1500 ప్రొఫెసర్లు, ఆప్కారి శాఖలో 452, పంచాయితీ రాజ్ శాఖలో 328, జలపనరుల శాఖలో 224 ఏఈఈ పోస్టులు, ఆర్థిక శాఖలో 169, అడవులు,…

Read More

ఘనంగా ఏ.ఎస్.ఎన్.ఎం. ప్రభుత్వ కళాశాల 59వ వార్షికోత్సవ వేడుకలు

                                                       వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు పాలకొల్లు, మార్చి,17(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి (ఏ.ఎస్.ఎన్.ఎం.) ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల 59వ వార్షికోత్సవ వేడుకలు కళాశాల ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ…

Read More

అన్న ఎన్టీఆర్ కు ఘననివాళి

యలమంచిలి: జనవరి,18(తెలుగు న్యూస్ పవర్) విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు,సంక్షేమ పథకాలకు ఆద్యుడు, కేవలం తొమ్మిది నెలల్లో పార్టీనీ అధికార పీఠంపై అధిష్టించి, ప్రపంచ దృష్టిని ఆకర్షించిన రాజకీయదురంధరుడు, అన్న, స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి వాడవాడల జరుపుకున్నారు. మండల కేంద్రమైన యలమంచిలి లో తెలుగుదేశం నియోజకవర్గ నాయకులు, సొసైటీ అధ్యక్షులు,బొప్పన హరి కిషోర్, ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. యలమంచిలి కూడలిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి, మండల పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న…

Read More

ఎన్టీఆర్ ఓ చరిత్ర – మంత్రి నిమ్మల రామానాయుడు

పాలకొల్లు: జనవరి,18(తెలుగు న్యూస్ పవర్) ఎన్టీఆర్ అంటే ఓ చరిత్రని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా, స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ దగ్గర ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజకీయాల్లో ఎన్టీఆర్ ముందు, ఎన్టీఆర్ తర్వాత అనేంత మార్పు తీసుకువచ్చిన మహనీయుడని జోహార్లు అర్పించారు. తెలుగుజాతి ఖ్యాతి ప్రపంచం నలుమూలల ఎన్టీఆర్ వల్ల విస్తరించిదన్నారు. సంక్షేమ కార్యక్రమాలు…

Read More