Skip to main content

Telugu News Power

నేటి సమాజానికి గాంధీ సిద్ధాంతాలు ఎంతో ఆదర్శం.

మానవాళి శాంతియుత సహజీవనానికి అవసరం. పాలకొల్లు: అక్టోబర్,1(తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక బి ఆర్ ఆర్ అండ్ జి కే ఆర్ చాంబర్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో గురువారం గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల చైర్మన్ కెవిఆర్ నరసింహారావు హాజరయ్యారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చైర్మన్ మాట్లాడుతూ, గాంధీ సిద్ధాంతాలు నేటి సమాజానికి ఎంతో అవసరమని, శాంతియుత జీవనానికి మానవ మానవ మనుగడకు గాంధీ సిద్ధాంతాలు…

Read More

స్మిత్ మచ్చర్ సాహసం, 180 ప్రాణాలు సురక్షితం. భారత దేశానికి వెల్లువెత్తుతున్న ప్రశంసలు.

దుబాయ్: సెప్టెంబర్,30( తెలుగు న్యూస్ పవర్. కామ్) దుబాయ్ నుంచి ఇజ్రాయిల్, టెల్ అవీవ్ కు వెళుతున్న విమానం బుధవారం హైజాక్ కు గురైంది. అయితే ఈ ఐజాక్ పాల్పడింది ఏ టెర్రరిస్టులో కాదు, సాక్షాత్తు విమాన పైలట్ ఈదు చర్యకు పాల్పడ్డాడు. ఈ విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులు తీవ్ర ఆందోళనతో, అరుపులు కేకలతో గీపెట్టిన హాహాకర దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా, ఇండియాకు చెందిన స్మిత్ మచ్చర్…

Read More

హైబ్రిడ్ రైల్వే ఇంజన్ తో ఇంధనం ఆదా. -డి యూ ఆర్ సి సి సభ్యులు జక్కంపూడి కుమార్.

పాలకొల్లు: సెప్టెంబర్,29( తెలుగు న్యూస్ పవర్. కామ్) గుజరాత్ సబర్మతి నుండి దేశంలోనే తొలి ఎల్ ఎన్ జి తో నడిచే రైలును కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించడం భారతీయ రైల్వే చరిత్రలో మరో మైలురాయిగా నిలుస్తుందని డి యూ ఆర్ సి సి సభ్యులు జక్కంపూడి కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ, మోదీ నాయకత్వంలో రైల్వే రంగం పూర్తి ఆధునీకరణ వైపు పరుగులు తీస్తున్నదన్నారు. గతంలో డీజిల్ మీదనే ఆధారపడే…

Read More

బలమైన భావి భారతానికి అంగన్వాడీల కృషి. అంగన్వాడీ టీచర్లకు సత్కారం.

పాలకొల్లు:సెప్టెంబర్,29 (తెలుగు న్యూస్ పవర్. కామ్) దేశవ్యాప్తంగా జరుగుతున్న “అంగన్ మిలన్ సేవ కార్యక్రమం”లో భాగంగా అంగన్వాడి ఉపాధ్యాయులు, ఆయాలను, ఆశా కార్యకర్తల సేవలను కొనియాడారు. స్థానిక మెప్మా కార్యాలయంలో మంగళవారం, అంగన్వాడీల అభినందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, తల్లులు గర్భవతులుగా ఉన్నప్పుడు పోషకాహారాన్ని తీసుకోవడానికి, గర్భిణీలుగా ఉన్నప్పుడు పాటించవలసిన జాగ్రత్తల గురించి కాబోయే తల్లులకు వివరించడం, అంగన్వాడీలు చేరిన బాలలకు పౌష్టికాహారం అందజేయడం, వారిని బలమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి వారు చేస్తున్న…

Read More

వీఆర్ఏల 14వ రోజు నిరసనలో వంటావార్పు.

పాలకొల్లు: సెప్టెంబర్,29 (తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రవ్యాప్తంగా విఆర్ఏలు తమ డిమాండ్ల కోసం కొనసాగిస్తున్న నిరసన దీక్షలు మంగళవారానికి 14 రోజులకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన శిబిరం లో పాల్గొని రోడ్డు మీదే వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. వి ఆర్ ఏ ల మండల అధ్యక్షులు రేపాక నరేష్, ఉపాధ్యక్షులు దాసరి దుర్గ భవాని, కార్యదర్శి బూర్గపు రాజు, కోశాధికారి బుడితి కనకరాజు, సభ్యులు తాడిపత్రి…

Read More

నరసాపురం – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రైలు పునరుద్ధరించాలి.

భీమవరం: సెప్టెంబర్,28 (తెలుగు న్యూస్ పవర్. కామ్) కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి, స్థానిక పార్లమెంటు సభ్యులు భూపతి రాజు శ్రీనివాస వర్మను స్థానిక బిజెపి నాయకులు క్యాంపు కార్యాలయంలో కలిశారు. నరసాపురం నుంచి వైజాగ్ కు రెగ్యులర్ గా ప్రతిరోజు రైలు నడపాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. నరసాపురం, పాలకొల్లు, కోనసీమ ప్రాంత ప్రజలు విశాఖపట్నం వెళ్లడానికి నేరుగా రైలు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్న…

Read More

పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ కార్యాలయం భీమవరం లో ప్రారంభం.

భీమవరం: సెప్టెంబర్, 25 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ కార్యాలయం శుక్రవారం భీమవరంలో ప్రారంభమైంది. ఇకనుంచి జిల్లా పరిషత్ కార్యదర్శి కలాపాలు భీమవరం నుంచి కొనసాగుతాయి. కొత్త జిల్లాలు ఏర్పడినప్పటికీ, జిల్లా పరిషత్ అవిభక్త ఉమ్మడి జిల్లా కేంద్రం ఏలూరులోనే ఉంది. స్థానిక సంస్థల పదవీకాలం గత బుధవారంతో ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఈ సందర్భంగా పరిపాలనా సౌలభ్యం కొరకు అనివార్యంగా జిల్లా కేంద్రాలకు జిల్లా పరిషత్ కార్యాలయాలు…

Read More

పాలకొల్లులో భారీ వర్షం.. 106.2 మి.మీ వర్షపాతం నమోదు.

పాలకొల్లు:సెప్టెంబర్,24 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఉదయం గం 8 ల నుంచి సాయంత్రం గం. 6 ల వరకు రికార్డు స్థాయి లో 106.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తహశీల్దార్ కార్యాలయ వర్గాలు తెలిపాయి.. దీంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరి, సాధారణ జనజీవనంపై ప్రభావం చూపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో తీరం…

Read More

పేదల డాక్టర్, పసిపిల్లల ప్రాణదాత రాఘవయ్య ఇకలేరు.

పాలకొల్లు:సెప్టెంబర్,24 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక రాధిక నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ బొప్పన రాఘవయ్య (82), అనారోగ్య కారణంగా గురువారం విజయవాడలో కన్నుమూసారు. వీరికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎందరో పేద ప్రజల బిడ్డలను కాపాడిన ప్రాణదాతగా, దిక్కు లేని వారికీ ఈ వైద్యుడే నారాయణుడు గా మొక్కులందుకున్నారంటే అతిశయోక్తి కాదు. భార్యభర్తలు ఇద్దరు ప్రభుత్వం ఉద్యోగులు అయినా, వీరి దగ్గరకే తమ బిడ్డను తీసుకువచ్చి బ్రతికించుకొన్నారంటే వారి హస్తవాసి ఎంతటి మహత్తు…

Read More

ఒడిశా తీరానికి సమీపంలోని మహానది ఆఫ్‌షోర్‌ బేసిన్‌ లో ఫలించిన ఒఎన్జీసీ గ్యాస్‌ అన్వేషణ. ‘సముద్ర మంథన్‌’లో తొలి విజయం.

భువనేశ్వర్‌: సెప్టెంబర్, 23( తెలుగు న్యూస్ పవర్. కామ్) భారత చమురు, సహజ వాయువు అన్వేషణ రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఒడిశా తీరానికి సమీపంలోని మహానది ఆఫ్‌షోర్‌ బేసిన్‌లో ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఒఎన్జీసీ ) సహజ వాయువును గుర్తించింది. కోణార్క్‌ తీరానికి సుమారు 43 కిలోమీటర్ల దూరంలో లోతైన సముద్రంలో చేపట్టిన అన్వేషణలో ఈ గ్యాస్‌ లభ్యమైంది. ఒఎన్జీసీ చేపట్టిన ప్రస్తుత డీప్‌వాటర్‌ అన్వేషణ కార్యక్రమంలో ఏం ఎన్=డి డబ్ల్యూ18-1-హెచ్-డి (ఎం…

Read More