గత ప్రభుత్వంలో అభివృద్ధికి ఆనవాళ్లు ఎక్కడ? -మంత్రి నిమ్మల ఎద్దేవా
యలమంచిలి: జూన్, 14 (తెలుగు న్యూస్ పవర్. కామ్) గత వైసీపీ ప్రభుత్వ పాలనలో అభివృద్ధికి ఆనవాళ్లు కూడా లేవని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. స్థానిక మేడపాడు లో ఆదివారం రూ. 2.39 కోట్ల పనులకు కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా,నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్…