Telugu News Power

అంతర్వేది ఉత్సవాల్లో భాగంగా వైభవంగా చోర సంవాదం.

చోర సంవాద ఘట్టం
రాజాధిరాజా వాహనంపై స్వామివారి గ్రామోత్సవం

సఖినేటిపల్లి: జనవరి,31(తెలుగు న్యూస్ పవర్) అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణోత్సవంలో భాగంగా శనివారం రాత్రి, 16 స్తంభాల మండపం వద్ద చోర సంవాద వేడుక జరిగింది. అర్చకులు, స్థానాచార్యులు, వేద పండితులు, పేరూరు పండితులు ఘనంగా ఈ ఘట్టాన్ని ఆవిష్కరించారు. చోర సంవాదం , భగవంతుడైన, శ్రీ మహావిష్ణువుకు, దారి దోపిడీ దొంగగా ఉన్న :పరకాళుడు’ అనే మహారాజుకు మధ్య జరిగేదే, చోర సంభాషణ. సంభాషణ ను ‘సున్నాలు-పన్నాలు’ పేరుతో వైష్ణవ పన్నవంగా తమిళంలో ఆలయ అర్చకులు, పేరూరు వేద పండితులు పఠించారు. పరకాలుడనే మహారాజు, స్త్రీలోలుడై, కుముదవల్లి అనే యువత కోసం దారి దోపిడీలు చేస్తుంటాడు. ఈ బాధలు పడలేక,విష్ణుమూర్తికి, దోపిడీ బాధితులు మొరపెట్టుకుంటారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి, మారు వేషంలో వెళ్లి, పరకాలుడిని, తిరుమంగై ఆళ్వారు గా మార్చి, నేరజీవితం నుంచి విముక్తి ప్రసాదిస్తారు. భక్తులు అతని బాధ నుంచి రక్షించబడతారు. ఇదే చోర సంవాద వృత్తాంతము.
స్వామి వారిని శనివారం సాయంత్రం, కళ్యాణోత్సవంలో భాగంగా, రాజాధిరాజా వాహనంపై అంతర్వేది మాడవీధుల్లో ఘనంగా ఊరేగించారు. రాత్రి స్వామివారు అశ్వవాహనంపై పురవీధులలో గ్రామోత్సవం నిర్వహించగా భక్తులకు చూసి తరించి, స్వామివారి అభయ ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.