Telugu News Power

అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి, గ్రామోత్సవం.

పంచముఖ ఆంజనేయ స్వామి వాహనంపై శ్రీ లక్ష్మీ నరసింహుడి గ్రామోత్సవం

సఖినేటిపల్లి: జనవరి, 28(తెలుగు న్యూస్ పవర్) దక్షిణ కాశీగా పిలువబడే, నవ నరసింహ క్షేత్రాలలో ప్రముఖమైన,డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అంతర్వేది లో వేంచేసియున్న, స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు, బుధవారం కీలక ఘట్టం చోటుచేసుకుంది. స్వామివారు, దేవేరులథతో సమేతంగా, ఆంజనేయ స్వాముల వారి వాహనం పై మాడవీధులలో ఊరేగి،గ్రామోత్సవం నిర్వహించారు. పంచముఖలైన, ఆంజనేయులు, తూర్పున, ఆంజనేయముఖ రూపం, అభీష్ట సిద్ధికి, దక్షిణాన, నరసింహుని అవతారం, విజయానికి, పశ్చిమాన గరుడ స్వరూపం, దీర్ఘాయుష్షు కు, ఉత్తరాన, వరాహ ముఖ రూపం, అష్టైశ్వర్యాలకు, ఊర్ధముఖాన (ఆకాశం వైపు) హయగ్రీవుని అంశ, జ్ఞానానికి, ప్రతీకలై తన భక్తులకు పంచ అభయాలు ప్రసాదిస్తుంటారు. స్వామివారి،మాడవీధుల గ్రామోత్సవం, ఊరేగింపు, కనులారా వీక్షించడం వల్ల పాపహరణం, సర్వముక్తిదాయకం అని భక్తుల విశ్వాసం. నేత్రపర్వంగా సాగిన ఊరేగింపులో, ఆలయ అధికారి సత్యనారాయణ, అధ్యక్షులు, ధర్మకర్తలు, పరువు ప్రముఖులు, భక్తులు పాల్గొని తరించారు.