Telugu News Power

అడవిపాలెం లో క్లీన్ అండ్ గ్రీన్

యమంచిలి:డిసెంబర్,2 (తెలుగు న్యూస్ పవర్) అడవిపాలెం గ్రామంలో, పాలకొల్లు అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్న సందర్భంగా మంగళవారం మండల పరిషత్ పాఠశాల, గాంధీ నగర్ పరిసర ప్రాంతాల్లో వాలంటీర్లు పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. తదుపరి మొక్కల పెంపకం ఆవశ్యకత గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. తరచూ మోసాలకు గురవుతున్న గ్రామస్తులను సైబర్ నేరాల బారిన పడకుండా రక్షించుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. మీ శిబిరంలో ఎన్ఎస్ఎస్ కమిటీ సభ్యులు పి శ్రీనివాసరావు సిహెచ్ రవికుమార్ తెలుగుదేశం నాయకులు, వాలంటీర్లు పాల్గొన్నార.