
పాలకొల్లు:డిసెంబర్,17 (తెలుగు న్యూస్ పవర్) కొణిదల ఉపాసనకు వ్యాపారంలో అత్యంత శక్తివంతమైన మహిళ అవార్డు వరించింది. వ్యాపారంతో పాటు,సామాజిక సేవవలో వీరు చేసిన,చేస్తున్న సేవలకు గుర్తింపుగా అవార్డు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఎన్ఎస్ఈ ఈ అవార్డు ప్రకటించింది. ఈ విషయాన్ని ఉపాసన తన సోషల్ మీడియా అకౌంట్లో అభిమానులతో ఈ సంతోషాన్ని పంచుకున్నారు. హృదయపూర్వకంగా ఈ అవార్డు స్వీకరిస్తున్నట్టు ఆమె తెలిపారు. అయితే తాను నెలలు మోస్తున్నందున, ప్రత్యక్షంగా ఈ అవార్డు స్వీకరించలేకపోతున్నందుకు విచారం వ్యక్తం చేశారు. సమాజంలో శారీరకంగా, మానసికంగా సకారాత్మక, పాజిటివ్ మార్పు తీసుకురావడంపై వారి దృష్టి కేంద్రీకరించినట్టు వెల్లడించారు. ఈ అవార్డు సేవ కార్యక్రమాల పరిధిని విస్తరించడానికి స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. ఈమె వివిధ మార్గాల ద్వారా సమాజానికి అనేక రూపాల్లో సేవలు అందిస్తున్నారు. అపోలో ఆసుపత్రి సామ్రాజ్యాన్ని సృష్టించిన ప్రతాప్.సి.రెడ్డి హృదయ స్పందన లయ తప్పకుండా కాపాడే వైద్య నారాయణుడు, ఉపాసన ఈ తాతగారి వారసురాలుగా కామినేని ఇంట పుట్టి. తన నటనాట్య కౌశలంతో హృదయ ఆహ్లాదానికి ప్రతిరూపమైన కొణిదల వారి ఇంట మెట్టి ఇరువురి పేరు ప్రతిష్ట లను ఉపాసన సమాజ సేవతో ఇనుమడింప చేస్తున్నారు. మన తెలుగువారు, ముఖ్యమంత్రుల కుటుంబానికి చెందిన నందమూరి వారి వారసురాలు, నటులు బాలకృష్ణ వారి కుమార్తె, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రాహ్మణి ఇదే అవార్డు గతంలో అందుకున్న వారి లో ఒకరు.