Telugu News Power

అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని శిక్షించాలి. -వైసీపీ డిమాండ్

అనుచిత వ్యాఖ్యలు చేసిన పత్రిక పై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్ఆర్ పార్టీ ఇంచార్జ్ గుడాల గోపి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేస్తున్న నాయకులు

పాలకొల్లు: ఏప్రిల్, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్) మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన పత్రిక అధిపతిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ గురువారం వైయస్సార్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల గోపి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. భార్యలను, సోదరిగా భావించి భర్తలు పెళ్లి చేయాలనే వ్యాఖ్యలను వైసిపి తీవ్రంగా ఖండించింది. మహిళల పట్ల అగౌరవంగా వ్యాఖ్యలు చేసిన వారిని శిక్షించాలని కోరారు. వైసిపి శ్రేణులతో కలిసి ర్యాలీగా పట్టణ పోలీస్ ఠాణ చేరుకొన్నారు. స్థానిక సి ఐ రజిని కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు, డీసీఎంఎస్ మాజీ అధ్యక్షులు, యడ్ల తాతాజీ, పెదగోపురం మాజీ చైర్మన్, పట్టణ అధ్యక్షులు కోరాడ శ్రీనివాస్, కర్ర జయ సరిత, జోగాడ ఉమా మహేశ్వర రావు మద్ద చంద్రకళ తదితర నాయకులు పాల్గొన్నారు.