యలమంచిలి: జనవరి,18(తెలుగు న్యూస్ పవర్)
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు,సంక్షేమ పథకాలకు ఆద్యుడు, కేవలం తొమ్మిది నెలల్లో పార్టీనీ అధికార పీఠంపై అధిష్టించి, ప్రపంచ దృష్టిని ఆకర్షించిన రాజకీయదురంధరుడు, అన్న, స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి వాడవాడల జరుపుకున్నారు. మండల కేంద్రమైన యలమంచిలి లో తెలుగుదేశం నియోజకవర్గ నాయకులు, సొసైటీ అధ్యక్షులు,బొప్పన హరి కిషోర్, ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. యలమంచిలి కూడలిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి, మండల పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి ఉపాధ్యక్షులు తమ్మినీడి శ్రీనివాస్, దాత తమ్మినీడి నరసింహారావు, శశి, కొడవటి ఫణి, కాసా సత్య, కేతల మల్లయ్య, ఆంజనేయులు,బొప్పన సురేష్, తదితరులు పాల్గొన్నారు.
అన్న ఎన్టీఆర్ కు ఘననివాళి
బొప్పన హరి కిషోర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ నివాళులు అర్పిస్తున్న నాయకులు.