పాలకొల్లు:డిసెంబర్,15 (తెలుగు న్యూస్ పవర్) అమరజీవి,భాష ప్రయుక్త రాష్ట్రాల సృష్టికర్త పొట్టి శ్రీరాములు వర్ధంతి సోమవారం జరిగింది. స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల తెలుగు మరియు చరిత్ర శాఖల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తెలుగు శాఖాధిపతి డాక్టర్ బూసి వెంకటస్వామి అధ్యక్షత వహించారు. ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తన శరీరం క్రిములకు ఆహారమైపోయినా, లెక్కచేయక ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణ త్యాగం చేసిన ధన్యజీవి పొట్టి శ్రీరాములని కొనియాడారు. తెలుగువారికి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు, దేశంలోనే తొలిసారి భాషా ప్రయుక్త రాష్ట్రాల విధానాన్ని ప్రవేశ పెట్టడానికి ఆద్యుడు, బాధ్యుడు త్యాగధనుడు పొట్టి శ్రీరాములు అన్నారు. హరిజన జీవన విధానాన్ని చూసి చలించిపోయి, వారి సమస్యలపై పోరాడి విజయం సాధించిన మహనీయ మానవతా మూర్తి పొట్టి శ్రీరాములని కీర్తించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ టి.కృష్ణ, కోఆర్డినేటర్స్ భద్రాచలం, డాక్టర్ వి యామిని, కన్వీనర్ డాక్టర్ సిహెచ్ ఉషారాణి, ప్రోగ్రాం ఆఫీసర్లు, డాక్టర్ ఎం రామకృష్ణ, డాక్టర్ వి విజయలక్ష్మి, పలువురు అధ్యాపకులు, సిబ్బంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.