Telugu News Power

అమరావతి మెడికల్స్ ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ

అమరావతి మెడికల్స్ ప్రారంభిస్తున్న మంత్రి వర్మ

పాలకొల్లు: డిసెంబర్,3(తెలుగు న్యూస్ పవర్) పట్టణంలో ఏర్పాటయిన నూతన వ్యాపార సంస్థ అమరావతి మెడికల్స్ ను కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ శనివారం ప్రారంభించారు. స్థానిక అద్దేపల్లి వారి సత్రం వద్ద నిర్మించిన వ్యాపార సముదాయంలో ఈ షాపు తెరిచారు. ప్రముఖ వైద్యులు, మాజీ ఎమ్మెల్యే త్సవటపల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే బంగారు ఉషారాణి, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, షాపులు ప్రారంభించారు. బ్రాండెడ్, ప్రిస్క్రిప్షన్ మందులు అందుబాటులో ఉంచటం ఈ షాపు ప్రత్యేకత. ఔషధ వ్యాపార రంగంలో లబ్ద ప్రతిష్టలైన వెంకట్రమణ మెడికల్స్, గోపాల్ రాజు (జనత) సారధ్యంలో తలుపుల శ్రీనివాస్, కే కృష్ణ వర్మ ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవం కాస్మోకల్చరల్ క్లబ్ అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు, బిజెపి నాయకులు ఉన్నమట్ల కపర్ది, జనసేన నాయకులు,బోనం నరసయ్య, చినబాబు, పెద్ద గోపురం చైర్మన్ మీసాల రామచంద్ర రావు, చేకూరి సూరిబాబు, కోటి రాజు,జక్కంపూడి కుమార్, పిల్ల బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

అమరావతి మెడికల్స్ ప్రారంభిస్తున్న డాక్టర్ బాబ్జి