Telugu News Power

ఆడబిడ్డలపై అభిమానం చాటుకున్న -మంత్రి నిమ్మల

పాలకొల్లు: నవంబర్,29 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి అటానమస్ కాలేజీ బాలికల వేచియుండు గది నిర్మాణం కోసం మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం శంకుస్థాపన చేశారు. గత ఏడాది ఈ నిర్మాణం కోసం మంత్రి హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఆ మేరకు భవన నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు.సుమారు 34 లక్షల రూపాయలు అంచనా తోఈ భవనంతో పాటు మరుగుదొడ్లు కూడా నిర్మిస్తారు. విద్యార్థినులకు ఉన్న ప్రత్యేక అవసరాలు దృశ్య ఈ నిర్మాణం తప్పనిసరి అయింది. అయితే ఈ సౌకర్యం ప్రైవేట్ పాఠశాలలో,కళాశాలలో కూడా ఎక్కడ ఉండదని చెబుతున్నా రు. ఉన్నత విద్యాశాఖ వారు ఇందుకు అనుమతి మంజూరు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా, ఏపీ ఈ డబ్ల్యూ ఐ డి సి భీమవరం ఆధ్వర్యంలో ఈ భవన నిర్మాణం చేపడతారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ఎన్సీసీ విద్యార్థులు మంత్రి నిమ్మల రామాలయం రామానాయుడును పరేడ్ గా తోడ్కొని వచ్చారు. ఆపై మంత్రి శంకుస్థాపన పూజాదికాలు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ టి. రాజరాజేశ్వరి, కళాశాల స్థాపకుడు అధ్యక్షులు వారి వారసులు అద్దేపల్లి మోహన్, కళాశాల గవర్నింగ్ బాడీ సభ్యులు డాక్టర్ ఎస్. రంగారావు ,కొమ్ముల మురళీకృష్ణ ,బీజేపీ నాయకులు కపర్ది, తెలుగుదేశం నాయకులు పెచ్చెట్టి బాబు కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు వారి సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.