Telugu News Power

ఆహ్లాదకరంగా బాలల దినోత్సవం

పాలకొల్లు, నవంబర్,14 ( తెలుగు న్యూస్ పవర్) బాలల దినోత్సవం సందర్భంగా పాలకొల్లు నియోజకవర్గం లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలలో ఆహ్లాదకరంగా వేడుకలు నిర్వహించారు. యలమంచిలి మండలం పెనమర్రు, ఎలమంచిలి అడవిపాలెం ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులు వివిధ కార్యక్రమాలలో తమ ప్రతిభ ప్రదర్శించారు. ఆయా పాఠశాల ఉపాధ్యాయులు శేష సాయి, పోలిశెట్టి క్రాంతి, శ్రీదేవి జయంతి, కుమారి తదితర పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పాలకొల్లు నారాయణ పాఠశాలలో చిన్నారులు ఉత్సాహంగా అనేక సాంస్కృతి కార్యక్రమాలతో అలరించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ తులసి వెంకటేష్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. వివిధ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు ఏజీఎం పి రామ్ రెడ్డి ఆర్ఐ కృష్ణ కిషోర్ బహుమతులు అందజేశారు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.