భీమవరం: ఫిబ్రవరి,23(తెలుగు న్యూస్ పవర్) ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం సందర్భంగా సోమవారం కలెక్టర్ చదలవాడ నాగరాణి పరీక్ష కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. స్థానిక మెంటే వారి తోట, జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, బ్రౌనింగ్ జూనియర్ కళాశాలలో ఈ తనిఖీలు నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. మాస్ కాపీయింగ్ పై ప్రత్యేకంగా నిఘా ఉంచాలని సూచించారు. పరీక్ష పేపర్లు సీసీ కెమెరాలు పర్యవేక్షణలో మాత్రమే సీల్ చేసి స్ట్రాంగ్ రూముకు తరలించాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డిఈఓ గొల్ల ప్రభాకర్ రావు, డిఇసి కెవి రామారావు తదితరులు ఈ తనిఖీలు కలెక్టర్ పర్యటినలో పాల్గొన్నారు.
ఇంటర్మీడియట్ పరీక్షాకేంద్రాలపై మెరుపు తనిఖీ.
ఇంటర్ పరీక్షా కేంద్రం తనిఖీ చేస్తున్న కలెక్టర్ నాగరాణి