మలికిపురం: జనవరి,9(తెలుగు న్యూస్ పవర్) అంబేద్కర్ కోనసీమ జిల్లా, మల్కిపురం, ఇరుసుమండ గ్రామంలో సంభవించిన బ్లోఅవుట్ కారణంగా, సురక్షిత శిబిరాలకు తరలి వెళ్లిన, గ్రామస్తులు శుక్రవారం ఇళ్లకు చేరుకోవడం ప్రారంభించారు. ప్రమాద ఉధృతి కొంతమేర తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఓఎన్జిసి విపత్తు నిర్వహణ శాఖ, బ్లోఅవుట్ నుండి వెలువడుతున్న మంటలపై నీటి గొడుగు ఏర్పాటు చేసి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో ఈ ప్రమాదం పూర్తిగా సమసి పోవచ్చునని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వరి పొలాలు దెబ్బతిన్నాయి. ఓఎన్జిసి ప్రమాదాల పట్ల స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇరుసుమండ ఓఎన్జిసి ప్రమాద బాధితులు, ఇళ్లకు చేరిక.