Telugu News Power

ఉత్తమ ఫలితాలకు 10వ తరగతి యాక్షన్ ప్లాన్

పాలకొల్లు డిసెంబర్ 11 తెలుగు న్యూస్ పవర్ పదవ తరగతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడానికి పదో తరగతి యాక్షన్ ప్లాన్ ఎంతగానో ఉపయోగపడుతుందని రీజినల్ జాయింట్ డైరెక్టర్ నాగమణి పేర్కొన్నారు. పదవ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచడానికి తీసుకోవాల్సిన విధి విధానాలపై చర్చించడానికి ఆర్జెడి నాగమణి పాలకొల్లు సందర్శించారు. స్థానిక బి.ఆర్. ఎం.వి పాఠశాలలో గురువారం జరిగిన సమావేశం లో ఆర్జేడి నాగమణి ఇప్పటివరకు జరిగిన పదవ తరగతి విద్యార్థుల వందరోజుల యాక్షన్ ప్లాన్ పనితీరును సమీక్షించారు. పదవ తరగతి పరీక్ష ల్లో మెరుగైన ఫలితాలు సాధించటానికి ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో శ్రమించి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఆర్జెడి నాగమణికి,జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ, వారి అధికారులు స్వాగతం పలికారు. ఈ సమావేశం జిల్లాలోని 5 మండలాల పరిధిలో జరిగింది. పాలకొల్లు, యలమంచిలి, పోడూరు, నర్సాపురం, మొగల్తూరు మండలాల విద్యాశాఖ అధికారులు, హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఎం ఈ ఓ లు గుమ్మళ్ళ వీరస్వామి, ఆర్ ఎన్ వి. గంగాధర్ శర్మ, ఏ. శ్రీవాణి, కెవిఆర్ కృష్ణంరాజు, గుణ్ణం విజయకుమార్, జి.సూర్యనారాయణ ప్రధానోపాధ్యాయులు ఝాన్సీ, రామేశ్వరం సత్యనారాయణ, సురేష్ బాబు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.