Telugu News Power

ఉద్యమాల జెండా రెపరెపలాడాలి-ఎమ్మెల్సీ గోపి మూర్తి

ఎమ్మెల్సీ గోపి మూర్తి

భీమవరం: జనవరి,7(తెలుగు న్యూస్ పవర్) ఉద్యమాల జెండా ఎప్పుడూ, రెపరెపలాడుతూనే ఉండాలని, ఎమ్మెల్సీ బొర్ర గోపి మూర్తి పిలుపునిచ్చారు. ఏపీ ఎన్జీవో పశ్చిమగోదావరి జిల్లా శాఖ ఎన్నికల సందర్భంగా, ముఖ్యఅతిథిగా హాజరై గోపి మూర్తి ప్రసంగించారు. ఈ సమావేశానికి ఏలూరు జిల్లా అధ్యక్షులు చోటగిరి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్జీవో కార్యవర్గాల నిర్మాణం పూర్తయిన తర్వాత, ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై ఉద్యమించడానికి సిద్ధం కావాలని మేల్కొల్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకం తగ్గిందన్నారు. అయితే ఆర్థిక విషయాల్లో మాత్రం కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వాని కంటే భిన్నంగా ఏమీ లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు వేసిన ఓట్లు రహస్యమైన, ఫలితం బహిరంగమేనని వెల్లడించారు. ఆనాడు ఉద్యోగుల ఓట్లతో ఆకలి తీరిందని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల ఆకలి గురించి ఏ ఆలోచించారని ప్రశ్నించారు. రివర్స్ పి ఆర్ సి ఇచ్చి, రెండున్నర ఏళ్ల అయినా, నేటికీ, ఐ.ఆర్.గాని, పిఆర్సి గాని వేయకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం డి ఏ కూడా ముఖ్యమంత్రి స్థాయిలో చర్చలు జరుపుతున్నారన్నారు. సమస్యలపై, ప్రాతినిధ్యం చేసి, ఫలితం రాకపోతే, ఉద్యోగ ఉపాధ్యాయ లోకం సమ్మెకు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటేడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, పశ్చిమగోదావరి జిల్లా శాఖ ఎన్నికలు, భీమవరంలో, బుధవారం జరిగాయి. జిల్లా అధ్యక్షులుగా ఉదిసి వెంకట పాండురంగారావు, ప్రధాన కార్యదర్శిగా, నూతన సుకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులు 15 మంది కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. యుటిఎఫ్ జిల్లా, అధ్యక్ష కార్యదర్శులు, విజయరాజు, పోలిశెట్టి క్రాంతి కుమార్ హాజరై నూతన కమిటీని అభినందించారు. ఈ ఎన్నికలు, ప్రకాశం జిల్లా ఏపీ ఎన్జీవో సంఘ అధ్యక్షులు కే శరత్ బాబు, ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో జరిగాయి.