Telugu News Power

ఎంఎంకె ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ

విద్యార్థులతో మంత్రి నిమ్మల

పాలకొల్లు: మార్చి, 14(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనురల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు స్థానిక ఎం ఎం కే ఎన్ ఎం ఉన్నత పాఠశాల ఆకస్మికముగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ, మధ్యాహ్నం భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. విద్యార్థులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి లోకేష్, విచారణ అభివృద్ధికి విప్లవాత్మకమైన మార్పులు తీసుకువ స్తున్నారని వెల్లడించారు. నాణ్యమైన విద్య విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు. విద్యారంగానికి ముఖ్యమైన, 16 వేల టీచర్ పోస్టులు కూటమి ప్రభుత్వం భర్తీ చేసిందన్నారు.