యలమంచిలి: జనవరి,18(తెలుగు న్యూస్ పవర్) మండల కేంద్రమైన యలమంచిలి లో తాళ్లూరి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా 27 మందికి కొత్త సైకిళ్ళు ఉచితంగా పంపిణీ చేశారు. విద్యార్ధినిలకు, రోజువారి వ్యవసాయ కార్మికులకు ఈ సైకిళ్లు అందచేశారు. ఈ కార్యక్రమంలో బొప్పన రాంబాబు, చిలుకూరి ఆంజనేయులు, తాళ్లూరు చందు, ఆకుల యేసు, బొప్పన సురేష్, కాసా సత్య, పలువురు గ్రామ పెద్దలు, యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
