యలమంచిలి:నవంబర్,29 (తెలుగు న్యూస్ పవర్) అడవిపాలెం గ్రామంలో ఏ ఎస్ ఎన్ ఎం గవర్నమెంట్ కళాశాల విద్యార్థులు ఆరోగ్య ర్యాలీ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆరోగ్యం పై అవగాహన కలిగించారు. ఇందుకు పలు సూచనలు చేశారు. ఈ ర్యాలీలో ఏఎన్ఎం సరళ వారి సిబ్బంది ఆరోగ్యం పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. గ్రామంలో తాగునీరు,మురికి నీటి సమస్య ఉన్నట్టు సర్వే ద్వారా గుర్తించారు. బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన వల్ల వచ్చే ప్రమాదాలు గురించి ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగు రైతు అధ్యక్షులు చెరుకూరి అంజిబాబు బొలిశెట్టి రావులియ్య, ప్రత్యేక శిబిరం ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ ఎం రామకృష్ణ, డాక్టర్ వి విజయలక్ష్మి ఎన్ఎస్ఎస్ కమిటీ సభ్యులు ఎం దివ్య , పార్థసారథి,వాలంటీర్లు పాల్గొన్నారు.
ఎన్ ఎస్ ఎస్ విద్యార్థుల ఆరోగ్య ర్యాలీ.