Telugu News Power

ఎన్ ఎస్ ఎస్ విద్యార్థుల క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం.

యలమంచిలి: నవంబర్,28 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి ప్రభుత్వ అటానమస్ కాలేజీ ఎన్.ఎస్.ఎస్ యూనిట్ 2 విద్యార్థులు శుక్రవారం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు. పాలకొల్లు మున్సిపల్ అధికారి, స్వచ్ఛఆంధ్ర, స్వర్ణాంధ్ర కోఆర్డినేటర్ పి.రోహిత్ కుమార్, ఉమా హాస్పిటల్స్ పాలకొల్లు డాక్టర్ ఉమా ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. కోఆర్డినేటర్ రోహిత్ కుమార్ మాట్లాడుతూ సామాజిక పరిశుభ్రత, తడి చెత్త పొడి చెత్త వేరు చేయటం వంటి విషయాల గురించి విద్యార్థులకు వివరించారు. డాక్టర్ ఉమా బాలికల వ్యక్తిగత పరిశుభ్రత గురించి వివరించారు. క్యాన్సర్ మహమ్మారిని ఎదుర్కొనే ముందు జాగ్రత్త చర్యలు గురించి తెలియజేశారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి గ్రామీణ సమస్యలపై సర్వే నిర్వహించారు. మండల తెలుగు రైతు, గ్రామ తెలుగుదేశం అధ్యక్షులు చెరుకూరి ఆంజనేయులు, బొలిశెట్టి రావులియ్య,టిడిపి నాయకులు, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు అధికారులు డాక్టర్ ఎం రామకృష్ణ, డాక్టర్ వి విజయలక్ష్మి, ప్రధానోపాధ్యాయులు పి. అనురాధ ,విజయలక్ష్మి, ఎన్ఎస్ఎస్ కమిటీ సభ్యులు ఎం దివ్య,. పంచాయతీ సిబ్బంది గ్రామ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు