పాలకొల్లు: డిసెంబర్,1(తెలుగు న్యూస్ పవర్) ఎయిడ్స్ వ్యాధి పై యువత అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరమని ప్రిన్సిపల్ డాక్టర్ టి రాజరాజేశ్వరి పేర్కొన్నారు. స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ ఆటాన్మస్ కాలేజీ విద్యార్థులు ఎయిడ్స్ డే సందర్భంగా ర్యాలీని ఉద్దేశించి సోమవారం ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఎయిడ్స్ పట్ల అపోహలు తొలగించి, సమాజంలో ప్రతి ఒక్కరు బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. ఈ అవగాహన ర్యాలీ సందర్భంగా విద్యార్థులు ఎయిడ్స్ నిరోధక నినాదాలు చేశారు. ఈ ర్యాలీ ఎన్ఎస్ఎస్ యూనిట్ -1, రెడ్ రిబ్బన్ క్లబ్ కలిసి నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వి విజయలక్ష్మి, కన్వీనర్ పి. జోష్ణ, వైస్ ప్రిన్సిపల్, టి కృష్ణ, కే భద్రాచలం, డాక్టర్ వి. యామిని డాక్టర్ బూసి వెంకటస్వామి, ఇతర అధ్యాపకులు పలువురు వాలంటీర్లు పాల్గొన్నారు.