పాలకొల్లు: ఫిబ్రవరి, 28(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ ఏ.ఎస్.ఎన్.ఎం. ప్రభుత్వ (స్వయం ప్రతిపత్తి) కళాశాలలో ఫిబ్రవరి 28న జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో శాస్త్రీయ అవగాహన పెంపొందించేందుకు పలు కార్యక్రమాలు జరిగాయి.
జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని భారత ప్రముఖ శాస్త్రవేత్త సర్ సివి రామన్ కనుగొన్న “రామన్ ప్రభావం”కు గాను నోబెల్ బహుమతితో, అంతర్జాతీయ గుర్తింపు పొందిన దినంగా దేశవ్యాప్తంగా కార్యక్రమంలో భాగంగా. జరిగిన సభలో కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. రాజ రాజేశ్వరి మాట్లాడుతూ, విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత మరియు పరిశోధనాసక్తి పెంపొందించుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో వివిధ రకాల మొక్కలు నాటారు. వివిధ విభాగాల అధ్యాపకులు విజ్ఞాన శాస్త్ర ప్రాముఖ్యతపై ఉపన్యాసాల్లో వివరించారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని విజయవంతం చేశారు.
ఏ ఎస్ ఎన్ ఎం కళాశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవం.
సివి రామన్ సభలో మాట్లాడుతున్న ప్రిన్సిపాల్ రాజ రాజేశ్వరి