Telugu News Power

ఏ.ఎస్.ఎన్.ఎం కళాశాలలో, దివిస్ ఉద్యోగ ఎంపికలు.

పాలకొల్లు: ఫిబ్రవరి,24(తెలుగు న్యూస్ పవర్) స్థానిక, శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి, ప్రభుత్వ కళాశాలలో ఈనెల 26న ఉద్యోగాల ఎంపిక జరగనుంది. ప్రముఖ ఔషధ తయారీ కంపెనీ, దివిస్ లేబరేటరీ లిమిటెడ్ వారు ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారని ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి మంగళవారం తెలిపారు.
అభ్యర్థులు,2022 నుండి 2025 వరకు ఆయా డిగ్రీలో ఉత్తీర్ణులైనవారు, 2026లో చదువుతున్న అభ్యర్థులు కూడ అర్హులు. బిఎస్సీ,(కెమిస్ట్రీ),
బి ఫార్మసీ,బీటెక్,(మెకానికల్, కెమికల్,ఇన్స్ట్రుమెంటేషన్) ఎమ్మెస్సీ, (ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ), ఎం ఫార్మసీ ఉత్తీర్ణులు అయిఉండాలి. వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.ట్రైనీ సూపర్వైజర్ / గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల కోసం ఈ_ క్యాంపస్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు రూ.18,000/- నుంచి రూ.24,000/- వరకు స్టైపెండ్ ఇస్తారు. ఉద్యోగంలో చేరిన వారికి పిఎఫ్, ఈ ఎస్ ఐ,
ఉచిత భోజనం, బస్సు సౌకర్యం వంటి సదుపాయాలు ఉంటాయి. ఈ డ్రైవ్ పురుష అభ్యర్థులకు మాత్రమే. ఆసక్తి గల అభ్యర్థులు, ఈనెల 26 న ఉదయం 10.00 గంటలలోపు కళాశాల ప్రాంగణానికి హాజరై, తమ బయోడేటా మరియు అవసరమైన సర్టిఫికేట్లతో పాల్గొనవలసిందిగా ప్రిన్సిపాల్ కోరారు.