Telugu News Power

ఏ ఎస్ ఎన్ ఎమ్ కళాశాలలో వంటలు ప్రదర్శన.

సంప్రదాయ వంటకాలు చూస్తున్న అతిధులు

పాలకొల్లు: జనవరి,8(తెలుగు న్యూస్ పవర్) స్థానిక అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి, ప్రభుత్వ కళాశాలలో, సంక్రాంతి పండుగ వేడుకల్లో భాగంగా, గురువారం సాంప్రదాయ వంటకాల ప్రదర్శన జరిగింది. కళాశాల సాంస్కృతిక విభాగం ఈ పోటీలు నిర్వహించింది. ఈ సందర్భంగా విద్యార్థులకు క్రీడా పోటీలు, ముగ్గుల పోటీలు, కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి, చిన్న గోపురం చైర్మన్, రేపాక ప్రవీణ్ భాను, డాక్టర్ సిరిగినీడి రంగారావు, నిమ్మకాయల సత్యనారాయణ, టి కృష్ణ, బూసి వెంకటస్వామి, ఆశ జ్యోతి, స్వర్ణలత, శిరీష తదితరులు పాల్గొన్నారు.