
పాలకొల్లు: జనవరి,30(తెలుగు న్యూస్ పవర్) ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని జై భారత్ జిల్లా అధికారి సుంకర రాము పిలుపునిచ్చారు. స్థానిక ఆద్దేపల్లి సత్యనారాయణమూర్తి కళాశాలలో, జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ రాజరాజేశ్వరి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ, ఓటు విలువ విశిష్టత గురించి విద్యార్థులకు వివరించారు. ఓటు హక్కు సక్రమంగా వినియోగించుకోవడం వల్ల సుస్థిరమైన బాధ్యతా యుతమైన ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవడానికి వీలు కలుగుతుందన్నారు. భావితరాలకు దిశానిర్దేశం
చేయటానికి ఓటు హక్కు శక్తివంతమైన ఆయుధం అన్నారు. దేశ సుస్థితులకు ఈ ఓటు వినియోగించుకోవాలని కోరారు. జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని, మేరా యువభారత్- జాతీయ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, కళాశాల రాజనీతి శాస్త్ర విభాగం, ఎన్ ఎస్ ఎస్ యూనిట్ 1&2 ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాటర్ లకు అవగాహన కల్పించడానికి, కళాశాల నుండి ప్రారంభమై బస్ స్టేషన్ వరకు విద్యార్థులు అధ్యాపకులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, టి కృష్ణ, ప్రోగ్రాం ఆఫీసర్లు మైలాబత్తుల రామకృష్ణ, వి విజయలక్ష్మి, బి.దుర్గారావు, జి డి శ్రీనివాస్, కే శివకృష్ణ, డి మన్మధరావు, పి దుర్గేశ్వరి, బి ఆసిస్ జ్యోతి, జోష్ణ, హేప్సీ రాణి, రోహిత్, శిరీష, రాజేష్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.