పాలకొల్లు: జనవరి,12 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక యుటిఎఫ్ సీనియర్ నాయకులు, విశ్రాంత ఉపాధ్యాయులు ఓడూరి రత్న కుమార్ సోమవారం మరణించారు. గతంలో వీరు పాలకొల్లు, ఎలమంచిలి మండలాల్లో సెకండ్ గ్రేడ్ ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి రిటైర్ అయ్యారు. యుటిఎఫ్ మండల అధ్యక్షులుగా,కార్యదర్శి గా అనేక హోదాల్లో పనిచేశారు. సంఘ పఠిష్టత కోసం ఎంతో కృషి చేశారు. వీరికి యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి పోలిశెట్టి క్రాంతి కుమార్, కే రాజశేఖర్, ఈడివీ ప్రసాద్, ఆంజనేయ స్వామి, జి ప్రకాష్ రావు, వర్ధినిడి నాగేశ్వరరావు, అశ్విని కుమార్, తాళబత్తులు వెంకటేశ్వరరావు, కుమారస్వామి రాజా, తదితరులు పార్థివ దేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు.