Telugu News Power

కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి పెద్ద పీట

పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఆయుర్వేద ఆసుపత్రికి మంత్రి చే శంకుస్థాపన

పాలకొల్లు/జున్నూరు: జనవరి,10(తెలుగు న్యూస్ పవర్)

ప్రజారోగ్యానికి పెద్ద పీట వేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనురుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు తెలిపారు. స్థానిక జున్నూరు గ్రామంలో 30 లక్షల నిధులతో నిర్మించనున్న ఆయుర్వేద ఆసుపత్రికి మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలు, సహజమైన పద్ధతిలో, సైడ్ ఎఫెక్ట్స్ లేని వైద్యం పొందాలనుకుంటున్నారని, అందుకు అనుగుణంగా, తో పాటు, పాలకొల్లులో 30 లక్షల వ్యయంతో మరో ఆయుర్వేద ఆసుపత్రి, ప్రస్తుత ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మిస్తున్నట్టు తెలిపారు. పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిని 12:30 కోట్ల నిధులతో కార్పొరేట్ స్థాయి ఆసుపత్రిగా తీర్చిదిద్దుతున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు, పాలవలస తులసి రావు, బోళ్ళ ప్రసాద్, గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, చినమిల్లి గణపతి రావు, బీరక ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.