Telugu News Power

కృష్ణ శిలతో ఆకివీడులో రామాలయం – ఉపసభాపతి రఘురామకృష్ణం రాజు

ఆకివీడు పెద్ద పేటలో నిర్మించనున్న రామాలయం ఆకృతి

ఉండి: మార్చి, 29(తెలుగు న్యూస్ పవర్.కామ్) శ్రీరా మనవ సందర్భంగా, రామాలయ ప్రవేశానికి అభ్యంతరం తెలిపిన వివాదంతో తెలుగులోకి వచ్చిన నాకు వీడు పెదపేట పురాతన రామాలయం నిర్మాణానికి పూనుకున్నట్టు ఉపసభాపతి కనుమూరి రఘవరామ కృష్ణంరాజు ఆదివారం తెలిపారు. రామాలయ పునర్నిర్మాణాన్ని ప్రముఖ హిందూ సంస్థల ఆధ్వర్యంలో, ప్రముఖ స్థపతి డా. ఈమని శివనాగిరెడ్డి నేతృత్వంలో చేపట్టనున్నామని శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ఆదివారం తెలిపారు. ఈ ఆలయాన్ని శిల్పకళ, వాస్తు, ఆగమ శాస్త్రల ప్రకార నిర్మిస్తామని తెలిపారు. పూర్తిగా కృష్ణ శిలతో నిర్మించే ఈ ఆలయం అద్భుతంగా నిలుస్తుందన్నారు. కనీసం 8 శతాబ్దాల పాటు చెక్కు చెదరకుండా ఉంటుందన్నారు. ఈ ఆలయ నిర్మాణం త్వరలో చేపడతామని రఘురామ వెల్లడించారు.