Telugu News Power

కె ఏ ఎం జిమ్ బాడీ బిల్డింగ్ పోటీ విజేతలు వీరే.

పాలకొల్లు: జనవరి,11(తెలుగు న్యూస్ పవర్) స్థానిక కె ఏ ఎం జిమ్ ఆధ్వర్యంలో శరీర సౌష్టవ పోటీలు జరిగాయి. విజేతలకు బహుమతి ప్రధానోత్సవ సభ, టాక్సీ స్టాండ్ వద్ద, సోమవారం రాత్రి జరిగింది. విజేతలకు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కారుమూరి నరసింహారావు బహుమతి ప్రధానం చేశారు. మిస్టర్ ఆంధ్ర ప్రథమ బహుమతి, విక్రమ్, రెండవ బహుమతి భాస్కర్, విశాఖపట్నం వారు అందుకున్నరు. ప్రశాంత్, మూడో స్థానం, మచిలీపట్నం దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి రాజేష్,గుడాల గోపి, ఎడ్ల తాతాజి, మేక శేషుబాబు, చేగొండి ప్రకాష్ డాక్టర్ వర్మ, ఎబినైజర్, చెల్లెమ్ ఆనంద ప్రకాష్, ఉచ్చుల స్టాలిన్ బాబు, రాధాకృష్ణ, వింజరపు రాము, వెంకటరెడ్డి తదితరులు హాజరయ్యారు.