Telugu News Power

కొత్త ఏడాదికి స్వాగతం.

గుణం నాగబాబు ఇంటి వద్ద నూతన సంవత్సర వేడుక
స్థానిక పెద్ద సాయిబాబా గుడి వద్ద భక్తుల రద్దీ

పాలకొల్లు, జనవరి,1(తెలుగు న్యూస్ పవర్) ఆంగ్ల సంవత్సరాది ప్రారంభ రోజు, గురువారం ఉదయం నుంచి సెంటిమెంటుగా, దేవాలయాలు కుటుంబ సమేతంగా, పసిబిడ్డలతో సహా తరలి రావడంతో భక్తులతో కిటకిటలాడాయి. స్థానిక పెద్ద సాయిబాబా గుడి వద్ద, పండగ మొత్తం అక్కడే జరిగినట్టు, విభూది వేసిన రాలనంత మంది భక్తులతో మధ్యాహ్నం దాదాపు మూడు గంటల వరకు దర్శనం కోసం భక్తులు బారులుతీరి ఉన్నారు. దాదాపు 15 వేల మందికి పైగా దర్శించుకున్నట్టు దేవాలయం వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ పోలీసు వారు ట్రాఫిక్ నియంత్రణ చేసి భక్తుల దర్శనానికి ఇబ్బంది లేకుండా చూశారు. క్షీరా రామలింగేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు.ధనుర్మాసం కావటంతో అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం లో భక్తులు పూజలు నిర్వహించారు. స్థానిక డైలీ మార్కెట్ వద్ద గల వెంకటేశ్వర స్వామి, సాయిబాబా ఆలయం వద్ద, బంగారు చెరువు గట్టు సాయిబాబా ఆలయం వద్ద భక్తులు తాకిడి కనిపించింది. ఆయా గ్రామాల్లో భక్తులు దైవదర్శనాలు చేసుకున్నారు. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ, సెంటిమెంట్ గా భూములు, మోటార్ బైకులు, కార్లు ఆభరణాలు, బట్టలు ప్రజలు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా రిజిస్టర్ ఆఫీస్ కళకళలాడింది. కొత్త బైకులు కూడా గుడికి తరలివచ్చి, పూజలు చేసుకున్నాయి. బ్యాంకు సిబ్బంది, కారు కొనుగోలుదారుల ఇళ్లకు వెళ్లి, కారులోనుకు సంబంధించి వ్యవహారాలు పూర్తిచేసి, ఒకటో తారీకు ఇంటి వద్ద కారు ఉండేలా ఏర్పాట్లు చేశారు.

మాజీ విప్ ముదునూరి ప్రసాద్ రాజు ఇంటి వద్ద శుభాకాంక్షలు తెలుపుతున్న వినుకొండ రవి దంపతులు

పాలకొల్లు నియోజకవర్గం శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్రావు, తదితర తెలుగుదేశం నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక వైఎస్ఆర్సిపి, కార్యాలయం వద్ద, ఇంచార్జ్ గుడాల హరిపోపాలరావు,గోపి ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుక జరిగింది. గుణ్ణం నాగబాబు, ఇంటి వద్ద, విశేషంగా తరలివచ్చిన అభిమానులతో నూతన సంవత్సర కేక్ కటింగ్ కార్యక్రమం జరిపారు. మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజును పాలకొల్లు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి నాయకులు నరసాపురం వెళ్లి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. యలమంచిలి మండల అధ్యక్షురాలు వినుకొండ ధనలక్ష్మి రవికుమార్ ను స్థానిక అధికారులు, వైఎస్ఆర్సిపి శ్రేణులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

నూతన సంవత్సరం ముంగిట, కొత్త బైక్

ఈపాటికే,ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి కోనసీమ కోస్తా తీరానికి తరలివస్తున్నట్టు సూచికగా, కర్ణాటక, తెలంగాణ రిజిస్ట్రేషన్ లో ఉన్న కార్లు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం వసతి సౌకర్యాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. స్థానికంగా ఉన్నవారు, ఇంతవరకు వదిలేసిన గృహాలను శుభ్రం చేయించి, నివాస యోగ్యంగాచేస్తున్నారు. ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్న దిండి గెస్ట్ హౌస్, క్లబ్బు మహేంద్ర వారు బుకింగ్ కోసం తెరచిన గంటలోనే 70 రూములు, ఒక గదికి, రోజుకు15 వేల రూపాయలకు బుక్ అయిపోయినట్టు, స్థానిక సర్పంచ్ ముదునూరి శ్రీనివాసరాజు దృష్టికి సమాచారం వచ్చినట్టు చెబుతున్నారు. ఇప్పటికే సాంప్రదాయ పిండి వంటల ఆర్డర్లు పూర్తయ్యాయి. పండగల జరిగే చోట వీటిని ఉచితంగా పంచే అవకాశం కూడా ఉంది. ఇతర దేశాలు రాష్ట్రాలు కూడా ఈ కోస్తా ప్రాంతం పిండి వంటలకు మంచి గిరాకీ ఉంది.

దాదాపు రెండున్నర టన్నుల, సాంప్రదాయ పిండి వంటల ,ఒకే ఒక్క భారీ ఆర్డర్ ఎలమంచిలి మండలం, కలగంపూడి కి దక్కింది. ఒక పోర్ట్ లో వారికి పంచడానికి ఈ ఆర్డర్ వచ్చినట్టు తెలిసింది. ఈ కుటీర పరిశ్రమ ఏందరికో ఉపాధి కల్పిస్తున్నది. స్థానిక హోటళ్ల లో ప్రత్యేకతలు, ఇప్పటికే వచ్చిన మిత్రులకు రుచి చూపిస్తున్నారు.

కర్నూలు నుంచి వచ్చిన మిత్రునికి,కాజ బిరియాని రుచి చూపిస్తున్నట్టు ఈ ప్రాంతానికి చెందిన ప్రముఖుడు తెలిపారు. ఓ తెలివైన హోటల్ వ్యాపారి పల్లెటూరు రుచులు పేరు పెట్టి సెంటిమెంట్ తో స్వాగతం పలుకుతున్నారు
రైతులు ఇంకా దాళ్వా పనుల్లో నిమగ్నమై ఉన్నారు. మీరు పట్టణానికి వచ్చి పండగ కొనుగోలు చేయడానికి కొన్ని రోజులు పట్టవచ్చునంటున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన ఆంధ్రుల అభిమాన పెద్ద పండుగకు అప్పుడే పండుగ కళ వచ్చేసింది. ఆయా దేవాలయాలకు సంబంధించి వ్యవహారాలు పూర్తిచేసి కమిటీ వారు విరాళాలకు తరలి వెళుతున్నారు. బరులు సిద్ధమై, అదృష్టవంతులను గిరులు ఎక్కించడానికి ఎదురుచూస్తున్నాయు. అలాగే సొమ్ములు పోగొట్టుకునే దురదృష్టవంతులు ఉంటారు
ఇప్పటికే పండగకు కావలసిన హంగులు, రంగులు పూర్తయి. ఈవెంట్ల అడ్వర్టైజ్మెంట్ లు విడుదలయ్యాయి. ఆటలు పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే వాటికి సంబంధించిన ప్రైజ్ మనీ తదితర వివరాలు ఆటగాళ్ల జట్లకు చేరాయి. నరసాపురంలో జాతీయస్థాయిలో పేరుగాంచిన పురుషులు మహిళలు కబడ్డీ పోటీలు సర్వం సిద్ధం చేశారు. లక్షలు, కోట్ల రూపాయల వ్యవహారంగా మారిన ఈ సంక్రాంతి పండుగ ఏటలాగే గ్రామాల్లో వర్గ పోరుకు తెర తీసింది. ఇతర దేశాలు,రాష్ట్రాలు,జిల్లాల నుంచి వచ్చిన వారికి ఈ పల్లె పండుగ, ఆనందఉత్సాహాలు కలిగించి, గుర్తుండిపోయే ఒక చిరకాల మధుర జ్ఞాపకంగా నిలువనుంది.