పాలకొల్లు: జనవరి,19 (తెలుగు న్యూస్ పవర్)
దళితులు,దళిత క్రైస్తవులు, మైనార్టీల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వ లక్ష్యంగా, ధ్యేయంగా, పనిచేస్తుందని, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు, నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పని చేసే ప్రభుత్వానికి తమ మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక క్రైస్తవ స్మశాన వాటిక అభివృద్ధి, సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇందుకు ప్రభుత్వం పుట్టినరోజులు మంజూరు చేసినట్టు తెలిపారు.27 వార్డులో స్మశాన వాటిక పనులకు 30 లక్షల రూపాయలు కేటాయించారన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చావు పుట్టుకలు ఎంతో పవిత్రమైనవని, ఆఖరి మజిలీ మరణాన్ని కూడా పవిత్రంగా జరుపుకోవడం కోసం స్మశాన వాటికలు సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. ఎస్సీ సబ్ – ప్లాన్ సభ్యులను తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేశామన్నారు. జగన్ ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్లించి, దళితులకు అన్యాయం చేసిందన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల ఓటమి నాయకులతో కలిసి,భూమి పూజ చేశారు. క్రైస్తవ సోదరులు నిమ్మలకు ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్యదర్శి పెచ్చెట్టి బాబు, పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, బిజెపి రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి ఉన్న మట్ల కపర్థి, జనసేన నాయకులు బోనం చినబాబు, తులా రామలింగేశ్వరరావు, క్రైస్తవ సోదరులు ఎబినేజర్ తదితరులు పాల్గొన్నారు.