హైదరాబాద్: ఫిబ్రవరి, 4(తెలుగు న్యూస్ పవర్) క్యాన్సర్ వ్యాధి నివారణకు అందరూ కంకణ బదులు కావాలని ప్రముఖ జనం చిత్ర నటులు, సమాజ సేవకులు, పద్మభూషన్ కొణిదల చిరంజీవి పిలుపునిచ్చారు. క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ కిమ్స్ లో జరిగిన అవగాహన కార్యక్రమంలో చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. క్యాన్సర్ నివారణ తొలిదశలో గుర్తించగలిగితే 90 శాతం పూర్తిగా వివరించే అవకాశాలు ఉంటాయని వెల్లడించారు. తాను ముందు చూపుతో పరీక్షలు చేయించుకోవడం వల్ల, ప్రియులకు సంబంధించి ఎదురైన చిన్నపాటి అనారోగ్యాన్ని ఆదిలోనే శాశ్వతంగా నిర్మూలించుకోగలిగాను అన్నారు. ఎంతటి ఆరోగ్యవంతులైన, పరీక్షలు చేయించుకోవడం పురుషులైన, మహిళలైనా తప్పదన్నారు. ఎవరి శరీరం వారికి, అనారోగ్యం గురించి హెచ్చరికలు చేస్తుందని, ఆ బాడీ చెప్పే మాట వింటే క్యాన్సర్ నుంచి బయటపడచ్చని వెల్లడించారు. క్యాన్సర్ నుంచి బయటపడటానికి ఎన్నో అవకాశాలు ప్రస్తుతం ఉన్నాయన్నరు. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించాలని తను ఎదురుచూస్తున్నానని, అదే సమయంలో కిమ్స్ నుంచి తనకు ఆహ్వానం అందించడం దైవేచ్చగా భావిస్తున్నానన్నారు. క్యాన్సర్ నివారణ ఉద్యమానికి, తన వంతు సాయంగా, క్యాన్సర్ నివారణ పై తీసే అవగాహన చిత్రాలలో తన వంతుగా నటిస్తానని చెప్పారు. క్యాన్సర్ వ్యాధి అనేక రూపాలలో వస్తుందని, మనల్ని ఏమీ చేయదని అతి నమ్మకంతో ఉండటం మంచిది కాదన్నారు. బాధితుల కుటుంబాలు పరిస్థితి ఆలోచించాలన్నారు. కిమ్స్ ఆస్పత్రి, ఏమిటి భాస్కర్ రావు తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎంతోమందికి ప్రాణదానం చేసిన డాక్టర్ మధు సేవాలను అభినందించారు.