Telugu News Power

క్షయ వ్యాధి పరీక్షలు

క్షయ వ్యాధి నివారణ ప్రచారం

పాలకొల్లు: ఫిబ్రవరి, 20 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక
లంకలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ నవ్య జీవన్ ఆధ్వర్యంలో టీబీ వారోత్సవాలు కార్యక్రమాన్ని జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ రవిబాబు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి బాబు మాట్లాడుతూ ప్రతి క్షయ అనుమానిత గలవారికి రెండు వారాల మించి దగ్గు,జ్వరం, బరువు తగ్గిపోవడం, ఆకలి లేకపోవడం లక్షణాలు గల వారందరికీ స్క్రీనింగ్ పరీక్షలు చేసి క్షయ నిర్ధారణ పరీక్షలు చేసి మరియు అవసరమైన వారికి చికిత్స అందజేయవలసిందిగా తెలియజేశారు. అనంతరం టీవీ ల్యాబ్ ను రికార్డులను పరిశీలించారు . పీహెచ్ సి వైద్యాధికారి డాక్టర్ నవ్య జీవన్. డాక్టర్ దినేష్.ఆరోగ్య విస్తరణ అధికారి గుడాల హరిబాబు. పి హెచ్ ఎన్ పి ఎలిజిబెత్. టీబి యూనిట్ సూపర్వైజర్ జి. ఉదయచంద్ర. సూపర్వైజర్ ఎస్ కే అమలేశ్వరరావు. ఎస్ టి ఎస్ కె.సత్తిబాబు. ఎస్టిఎల్ఎస్ బి లక్ష్మీనారాయణ, టిబి హెచ్ వి వెంకటేష్. ల్యాబ్ టెక్నీషియన్ సిహెచ్ ప్రసాదు. కే ప్రసాదు . డి పి సి విద్యానంద్. డిస్టిక్ ల్యాబ్ సూపర్వైజర్ రెడ్డి. మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు