పాలకొల్లు: మార్చి, 28 (తెలుగు న్యూస్ పవర్. కామ్) క్షీరపురిలో, రాయల కాలం నాటి అష్టదిగ్గజ కవుల దిగి వచ్చారా అన్నట్టుగా, భూవన విజయం ప్రదర్శించారు. శాఖ సంస్కార భారతి, పశ్చిమగోదావరి జిల్లా శాఖ, క్షత్రియ సంక్షేమ పరిషత్, కాశ్మీరు కల్చరల్ క్లబ్ సౌజన్యంతో మీ ప్రదర్శన జరిగింది. శ్రీరామనవమి, ప్రపంచ రంగస్థలం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పివిఎన్ కృష్ణ, శ్రీకృష్ణదేవరాయలుగా, డాక్టర్ కడిమళ్ళ వరప్రసాద్, మహామంత్రి తిమ్మరసు గా, చేగొండి సత్యనారాయణ మూర్తి, రామరాజభూషణునిగా, తదితర పండితులుగా, భువన విజయం సంస్కృతీ, సౌరభాలను గుబాళించింది. ఆపాతమధుర సాహితీ ఝరి తన్మయులను చేసింది. ఈ సందర్భంగా, అష్టదిగ్గజ కవులు ఘనంగా సత్కరించారు. రెడ్డప్ప దవేజీ సభకు స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో, క్షత్రియ పరిషత్ అధ్యక్షులు, చెరుకూరి సూర్యనారాయణ రాజు, కాశ్మీర్ అధ్యక్షులు గొట్టుముక్కలు గాంధీ భగవాన్ రాజు, సంస్కార భారతి రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు, పి వి ఎన్ కృష్ణ, చేగొండి సత్యనారాయణమూర్తి, కార్యదర్శి ఎ. రామ్ జీ, కోశాధికారి యర్రంశెట్టి వెంకటరత్నం, రసధుని పెద్ది బొట్ల లక్ష్మీనారాయణ, వంగా నరసింహారావు, గుండా రామకృష్ణ, డాక్టర్ ప్రతాప్ రాజు, బాబు శ్రీ, కోలాటి పెద్దిరాజు, పొన్నాడ సుబ్రహ్మణ్యం, నెక్కంటి సుబ్బారావు, అన్నపూర్ణేశ్వరరావు, పోకల, దిరిశాల వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
క్షీరపురిలో కొలువుదీరిన అష్టదిగ్గజ కవులు.
భువన విజయం అష్టదిగ్గజ కవులు