Telugu News Power

క్షీరా రామలింగేశ్వర స్వామి వారికి, ఎకరా 75 సెంట్ల భూమి కానుకగా ఇచ్చిన,పోతురెడ్డి కామరాజు మనువమలు.

భూమి కానుకగా ఇచ్చిన కామరాజు కుటుంబ సభ్యులు

పాలకొల్లు: జనవరి,16(తెలుగు న్యూస్ పవర్) స్థానిక క్షీరారామలింగేశ్వర స్వామి వారికి, పూలపల్లి గ్రామానికి చెందిన పోతురెడ్డి కామరాజు, వారి మనుమలు ఎకరా 75 సెంట్ల భూమిని విరాళంగా ఇచ్చారు. స్వామివారి దర్శనం నిమిత్తం ఈ కానుక సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా భమిడిపాటి వెంకన్న అభిషేక పండితులచే, పార్వతీ పరమేశ్వరులకు, అర్చన పూజా కార్యక్రమాలు జరిపించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం భూమి కానుకగా ఇచ్చిన దాతలను శేష వస్త్రములతో ఆలయ అధికారులు సత్కరించారు. వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు, పి. వాసు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

కనుమ గ్రామోత్సవం

కనుమ పండుగ సందర్భంగా, క్షీరా రామలింగేశ్వర స్వామి వార్లు, దేవేరులు వివిధ వాహనాలపై గ్రామోత్సవం చేశారు. ఈ ఈ ఊరేగింపును ఆలయ ధర్మకర్త మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు. ఈవో, ముచ్చర్ల శ్రీనివాసరావు, ప్రధాన అర్చకులు, క్రిష్టప్ప, తదితరులు ఊరేగింపు ప్రారంభించారు.

అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు. ఈవో, ముచ్చర్ల శ్రీనివాసరావు, ప్రధాన అర్చకులు, క్రిష్టప్ప, తదితరులు ఊరేగింపు ప్రారంభించారు.