పాలకొల్లు:ఫిబ్రవరి,27(తెలుగు న్యూస్ పవర్) గ్రామ గ్రామానికి వచ్చే,సంచార చికిత్స కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని
డాక్టర్ ఎం నవ్య జీవన్ కోరారు.
లంకల కోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కాపవరం సచివాలయం వాలమర్రు గ్రామంలో సంచార చికిత్స శిబిరాన్ని డాక్టర్ నవ్య జీవన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నవ్య జీవన్ మాట్లాడుతూ, ఈ క్యాంపు నందు బీపీ. షుగర్ ఇతర అనారోగ్య సమస్యలకు పరీక్షలు చేసి మందులు ఇవ్వడం. గర్భిణీ స్త్రీలకు సలహాలు సూచనలు ఇవ్వడం కూడా చేశారు. మూడు వారాలకు మించి దగ్గు. తెమడపడటం. సాయంత్రం వేళ జ్వరం వచ్చుట. ఆకలి మందగించుట తదితరు లక్షణాలు ఉంటే తెమడ పరీక్ష చేయించుకోవాలని, టీబి వ్యాధి నిర్ధారణ అయితే వ్యాధికి సంబంధించిన మందులు ఆరు నెలలకు సరిపడగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అలాగే క్యాన్సర్ పై సర్వే చేయడం జరుగుతుందని బ్రెస్ట్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్.నోటి క్యాన్సర్ అనుమానితులను గుర్తించి పరీక్షలు నిర్వహించి వారికి మందులు ఉచితంగా అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి గుడాల హరిబాబు. పి హెచ్ ఎన్ పి ఎలిజిబెత్. సూపర్వైజర్ ఎస్ కే అమలేశ్వర రావు.ఎంఎల్ హెచ్ పి.యువతేజ. ఏఎన్ఎం మరియమ్మ.డీఈవో దివ్య. ఆశా కార్యకర్తలు సుందరమ్మ. నాగమణి. సుధ. తదితరులు పాల్గొన్నారు
గ్రామ గ్రామానికి వైద్యం.
గ్రామీణ వైద్య శిబిరం పరిశీలిస్తున్న వైద్యులు