Telugu News Power

చలో విశాఖ జయప్రదం చేయాలి – సిఐటియు పిలుపు.

యలమంచిలి:డిసెంబర్,9 (తెలుగు న్యూస్ పేపర్) చలో విశాఖ జయప్రదం చేయాలని సిఐటియు పిలుపునిచ్చింది. సంఘ నాయకులు దేవ సుధాకర్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వివిధ ప్రభుత్వ పథకాల అమలులో పాత్ర పోషిస్తున్న కార్మికులను సన్నద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా దొడ్డిపట్ల,యలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది కలిసి ప్రసంగించారు. ఈనెల 31 నుంచి వచ్చే ఏడాది, జనవరి,4 వరకు ఈ మహాసభలు జరుగుతాయి. అఖిలభారత స్థాయిలో విశాఖలో తొలిసారి ఈ సభ జరుగుతున్నది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారతదేశ కార్మికలోకం ఈ సభలకు హాజరవుతారు. సుమారు 70 లక్షల మంది వివిధ సంఘాలకు సంబంధించి కార్మికులు హాజరుకానున్నారని సిఐటియు నాయకులు దేవ సుధాకర్ తెలిపారు.
డిమాండ్లు
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన లేబర్ కోడ్ లు రద్దు చేయాలి
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
వేతనాలు నెలకు కనీసం 26 వేల రూపాయలు చెల్లించాలి వంటి పలు ముఖ్య డిమాండ్లను ఈ సభలో ప్రతిపాదించనున్నారు. ఆంధ్రప్రదేశ్ సిఐటియు శాఖ ఈ సభ జయప్రదం కావటానికి కార్మికులకు ఆర్థికంగా, హార్దికంగా సహకరించాలని పిలుపునిచ్చారు.

యలమంచిలి,దొడ్డిపట్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సిఐటియు కార్మికుల ప్రదర్శన.