Telugu News Power

చిత్రాయి చెరువుగట్టు ఆరోగ్య సమస్యపై స్పందించిన వైసిపి.

బాధితుల నుంచి విషయాలు తెలుసుకుంటున్న ఇంచార్జ్ గోపి

పాలకొల్లు: మార్చి, 1(తెలుగు న్యూస్ పవర్ .కాం) స్థానిక చిత్రాయి చెరువు గట్టు నివాసులైన పట్టణ ప్రజలు గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్య పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరి శరీరంపై దద్దుర్లు ఏర్పడడం వంటి చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. ఇక్కడ నీటి కాలుష్యం వల్ల చర్మ రోగాలు వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ సమస్యపై వైఎస్ఆర్సిపి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల గోపి, జిల్లా మార్కెటింగ్ కమిటీ మాజీ అధ్యక్షులు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి యడ్ల తాతాజీ, పెదబాబు మాజీ చైర్మన్ కోరాడ శ్రీనివాస్ బాధితులను ఆదివారం అమర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా విధులు నిర్వహిస్తున్న వివిధ శాఖల అధికారులతో సమస్య గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారి దృష్టికి ఈ సమస్యను తీసుకువచ్చారు. ఈ సమస్యలతో పరిష్కరిస్తామని బాధితులకు గోపి హామీ ఇచ్చారు.