పాలకొల్లు: మార్చి,5(తెలుగు న్యూస్ పవర్.కాం) ప్రతిభకు పేదరికం అడ్డు కాదని, మరోసారి నిరూపించింది గుమ్మళ్ళ భార్గవి. కోనసీమ జిల్లా, రాజోలుకు చెందిన ఈమె ఐదేళ్ల క్రితం డాక్టర్ సీటు సంపాదించింది. ఆమె ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అప్పుడే ఆమె దాతల సహకారం కోరింది. పాలకొల్లు వాకర్స్ క్లబ్ వారికి కూడా ఆర్థిక సహాయం కోసం ఒక వాట్సాప్ సందేశం అందింది. క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు, తటవర్తి సుధాకర్ రావు, షేక్ పీర్ సాహెబ్ ఆమె స్వగృహం వద్ద కొంత మొత్తం స్కాలర్షిప్ గా అందించారు. ఎంబిబిఎస్ పట్టా పుచ్చుకున్న భార్గవి, తను పట్టా తీసుకున్న ఫోటోతో పాటు, క్లబ్బు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వాట్సాప్ సందేశం పంపించింది. చేసిన ఉపకారం ఇట్టే మరిచిపోతున్న ఈ రోజుల్లో, భార్గవి కృతజ్ఞతా పూర్వక సంస్కారానికి సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఆమె మరింతగా వృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తూ, క్లబ్ తరఫున కార్యవర్గం వారు అభినందనలు తెలియజేశారు.
చేతిలో డాక్టర్ పట్టా మనసు నిండా కృతజ్ఞత.
డాక్టర్ పట్టా తో భార్గవి