పాలకొల్లు వ్యవసాయ సహాయ సంచాలకు డాక్టర్ పి మురళీకృష్ణ భారీ వర్షాల వల్ల ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేసి తగు చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.ఈరోజు పాలకొల్లు పరిసర గ్రామాల్లో పర్యటించి నీటమునిగిన వరిచేలను పరిశీలించామన్నారు.ఎక్కడైనా చేలు ముంపు గురైతే రైతులు సంబంధిత వ్యవసాయ అధికారులకు నేరుగా గాని, ఫోన్ ద్వారా గాని చెప్పాలన్నారు. ఎరువులు పురుగు మందులు ఈ పరిస్థితుల్లో వాడటం వల్ల ఉపయోగం ఉండదన్నారు. చేలో నీరు నిలువ లేకుండా చూసుకోవాలన్నారు పూత, కంకి దశలో ఉన్నందున నీటమునిగితే గింజలు తాలు వస్తాయన్నారు. పడిపోయిన వారిని కుచ్చులు చేసి నిలబెట్టాలన్నారు. రైతులకు వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు ఇచ్చే సూచనలు పాటించి నష్టం జరగకుండా చూసుకోవాలని తెలియజేశారు.