పాలకొల్లు: జనవరి, 8(తెలుగు న్యూస్ పవర్) సంక్రాంతి పండుగ సందర్భంగా ఛాంబర్స్ కళాశాలలో విద్యార్థులు గురువారం, ముగ్గుల పోటీల్లో 175 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ముగ్గురు పోటీల న్యాయనిర్నేతలుగా. ఏ. విశాల లక్ష్మి, రేపాక శ్రీ చిత్ర, కారుమూరి సబిత, సింధు వ్యవహరించారు. విద్యార్థులు, కాలేజీ ప్రాంగణం అంతా, తమ ముగ్గులతో పండుగ వాతావరణం లో, సందడి చేశారు. విద్యార్థుల ప్రతిభ న్యాయ నిర్ణయతలను అబ్బురపరిచింది. విద్యార్థులను, సర్టిఫికెట్లు మెడల్స్ తో సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కారుమూరి నరసింహారావు, ట్రెజరర్ ప్రవీణ్ భాను, ప్రిన్సిపల్ డాక్టర్ డి వెంకటేశ్వరరావు, రాధా మాధవి తదితరులు పాల్గొన్నారు.
ఛాంబర్స్ కళాశాలలో ముగ్గుల పోటీలు
ముగ్గురు పరిశీలిస్తున్న జడ్జిలు