Telugu News Power

జగ్గన్న తోట,,ప్రభల ప్రభావానికి, ఇక మన రాష్ట్ర పండుగగా గుర్తింపు.

జగ్గన్నథతోట ప్రభుల ఊరేగింపు

అమరావతి: జనవరి,9(తెలుగు న్యూస్ పవర్) శతాబ్దాల, చరిత్ర కలిగిన, తూర్పుగోదావరి జిల్లా జగ్గన్నతోట ప్రభల తీర్తానికి, యునెస్కో, వారసత్వ పండుగ హోదా పొందగల, అన్ని అర్హతలు ఉన్నాయి. అందుకు తగిన కృషి జరగలేదని చెబుతారు. కూటమి ప్రభుత్వం ఈ ఏడాది ప్రబల తీర్థాన్ని రాష్ట్ర పండుగా గుర్తించింది. జిల్లా ప్రజలకు ఈ సంక్రాంతికి,పండుగ కానుకుగా ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఈ మేరకు అవకాశం కల్పించినట్టు, రాష్ట్ర సాంస్కృతిక శాఖ మాత్యులు కందుల దుర్గేష్, చైర్మన్ తేజస్వి శుక్రవారం, పత్రికా సమావేశంలో వెల్లడించారు. ప్రబల తీర్థానికి, వందల ఏళ్ల ఘనమైన సాంస్కృతిక, నేపథ్యం,చరిత్ర ఉన్నాయి. దేశ విదేశాల నుంచి పర్యాటకులు ఈ పండుగ వేడుక, చూడడానికి ప్రతి ఏటా విశేషంగా తరలివస్తారు. భక్తులు అపారమైన నమ్మకంతో, తమ ఇష్టదైవాన్ని, ధరించిన, ప్రభలను సుదూర ప్రాంతం, వాగులు, వంకలు దాటుతూ గమ్యాన్ని చేరుస్తారు. కిలోమీటర్ల కొద్ది, వేచి ఉన్న వేచి ఉన్న లక్షలాదిమంది, ఈ అపురూప దృశ్యాన్ని చూసి తరించిపోతారు. కోనసీమకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్న, ప్రభల తీర్థం, రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపుతో మరో కలికి తురాయి కానుంది. గోదావరి జిల్లాల ప్రజలు వర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇందుకు, కృషి చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి దుర్గేష్ ల పట్ల కృతజ్ఞతా భావం కనబరుస్తున్నారు.

ప్రభల తీర్తనికి, రాష్ట్ర గుర్తింపు పై ప్రకటన చేస్తున్న, సాంస్కృతిక శాఖామాత్యులు కందులు దుగ్గేష్, చైర్ పర్సన్ తేజస్విని