విశాఖపట్నం: ఫిబ్రవరి,4(తెలుగు న్యూస్ పవర్) జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ, పార్టీకి దూరంగా ఉండబోతున్నట్టు బుధవారం విశాఖపట్నంలో ప్రకటించారు. ఈ నిర్ణయం తాను పార్టీలో నిర్వహిస్తున్న అన్ని బాధ్యతలకు వెంటనే వర్తిస్తుందని తెలిపారు. పార్టీల మధ్య విభేదాలు పొడచూపుకుండా ఉండేందుకు జనసేన పార్టీ తరపున తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. అంతకుముందు జనసేన పార్టీకి కూటమి ప్రభుత్వ ధర్మం ప్రకారం, పదవులు కేటాయించడం లేదని, బొలిశెట్టి బహిరంగ వేదికలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి తాను ఇంచార్జిగా ఉన్న నియోజకవర్గంలో దేవస్థానం కమిటీకి జనసేన పార్టీ తరపున ఒక్క ధర్మకర్త పదవి కూడా లభించలేదని వెల్లడించారు. ప్రతిపక్ష వైఎస్ఆర్సిపి ఈ విషయాన్ని కూడైకూస్తుంది. జనసేన వర్గాలు బొలిశెట్టి కేవలం పర్యావరణ విషయాలకు సంబంధించిన అంతవరకు మాత్రమే పార్టీ నుంచి దూరంగా ఉంటారని స్పష్టం చేస్తున్నారు. బొలిశెట్టి సత్యనారాయణ పార్టీలో పునః ప్రవేశం చేసి చురుగ్గా పాల్గొంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
జనసేనకు బొలిశెట్టి దూరం.
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ