వెస్ట్ ఇండోర్: మార్చి, 5(తెలుగు న్యూస్ పేపర్ .కాం)
కృష్ణా జయశంకర్, మౌంటెయిన్ వెస్ట్, ఇండోర్ షాట్ పుట్‌లో 17.09 మీటర్ల,జీవితకాల బెస్ట్‌తో భారత మహిళల ఇండోర్ రికార్డు సృష్టించింది.ఇది మొదటి సారి భారత మహిళా క్రీడాకారిణి 17 మీటర్లు దాటిన చరిత్ర. కృష్ణ జయశంకర్ 2002 నవంబర్ 10న భారతదేశంలో జన్మించారు. ఈమె 23 ఏళ్ల షాట్ పుట్ క్రీడాకారిణి. చెన్నైలో బాస్కెట్‌బాల్ అంతర్జాతీయ క్రీడాకారులు జయశంకర్ మీనన్ (6’6″ పవర్ ఫార్వర్డ్), ప్రసహల కుమార్తె. అమెరికాలో యూఎన్ఎల్వీ విశ్వవిద్యాలయంలో చదువుతూ, శిక్షణ పొందుతోంది. ఈమె సాధించిన కీలక విజయాలు2025 మౌంటైన్ వెస్ట్ ఇండోర్ ఛాంపియన్‌షిప్స్‌లో 16.03మీ. ఇండోర్ జాతీయ రికార్డు, కాంస్య పథకం,2026 మౌంటైన్ వెస్ట్ ఇండోర్‌లో 17.09 మీటర్ల, జీవితకాల ఉత్తమ రికార్డు మళ్లీ రాస్తూ (మొదటి భారతీయురాలు 17మీ. దాట్డ).డిస్కస్ థ్రో, షాట్ పుట్ (3కేజీ)లో పోటీపడుతుంది. బాడీ షేమింగ్‌ను అధిగమించి ముందుకు సాగింది.ఆసియా గేమ్స్, కామన్‌వెల్త్ గేమ్స్‌పై లక్ష్యంగా సాధన చేస్తుంది.
