Telugu News Power

జాతీయ సార్వత్రిక సమ్మె ఘనవిజయం.

యలమంచిలి మండలం దొడ్డిపట్లలో జరిగిన సమ్మె సభలో ప్రసంగిస్తున్న పోలిశెట్టి

భీమవరం/పాలకొల్లు/యలమంచిలి: ఫిబ్రవరి, 12(తెలుగు న్యూస్ పవర్) అఖిలభారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం జరిగిన జాతీయ సార్వత్రిక సమ్మె ఘన విజయం సాధించిందని కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు. బ్రిటిష్ కాలం నుంచి పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేయడంపై, దేశంలోని ప్రముఖమైన 10 కార్మిక సంఘాలు గురువారం జాతీయ సార్వత్రిక సమ్మె జరిపాయి. కార్మికుల సంక్షేమాన్ని, ఆరోగ్యాన్ని కాలరాస్తూ, మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్ లు వెంటనే ఉపసంహరించుకోవాలని కార్మిక లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమ్మెకు పిలుపునిచ్చింది. పశ్చిమగోదావరి జిల్లా నలుమూలల కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పూర్తిగా పాల్గొన్నాయి. వీరికి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. భీమవరం, పాలకొల్లు, యలమంచిలి మండలాల్లో ర్యాలీలు నిర్వహించారు. కార్మికులను యంత్రాల కంటే హీనంగా కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టడాన్ని,సంఘాలు తీవ్రంగా గర్హించాయి. పరిమితి లేని పనిగంటలు కార్మికులను శారీరకంగా, మానసికంగా దేవుడు ఇబ్బందులకు గురి చేస్తాయని వాపోయారు. మహిళలు కూడా రాత్రిపూట పనిచేయాలని చట్టం చేయటం, ప్రభుత్వ ధమానీతికి పరాకాష్టగా చెప్పవచ్చునన్నారు. కార్మిక సంఘాల ఏర్పాటును కూడా మొగ్గలోనే తుంచి వేయాలని చేసిన నిబంధనలు కార్మికుల ఐక్యతను దెబ్బతీయటానికి వెల్లడించారు. కార్మికుల,కార్మిక సంఘాల ప్రయోజనాలకు విఘాతం కలిగించే, దుర్మార్గపు నూతన చట్టాలు రద్దు చేసే వరకు కార్మిక సంఘాలు పోరాటం చేయాలని పలువురు నాయకులు పిలుపునిచ్చారు.జిల్లాలో పలుచోట్ల ప్రజా సంఘాలు ఈ సమ్మెలో విశేషంగా పాల్గొన్నాయి. యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, పోలిశెట్టి ప్రాంత కుమార్, అధ్యక్షులు విజయరామరాజు, భీమవరం పాలకొల్లు ఎలమంచిలి మండలంలో జరిగిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. సిఐటియు నాయకులు దేవ సుధాకర్ యలమంచిలి మండలంలో సమ్మె విజయవంతం కావడానికి కృషి చేశారు. విజయ్ కుమార్ ఉద్యమకారులకు మజ్జిగ అందజేశారు. ఎలమంచిలి మండల కమిటీ అల్పాహారం అందజేసింది. మండల కేంద్రం వద్ద ఉరితాళ్లు వేసుకొని ఉద్యకార్లు నిరసన తెలిపారు.