ముంబై: మార్చి, 5(తెలుగు న్యూస్ పవర్. కామ్)టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో భారత్ అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్‌పై సంచలన విజయం సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ హై స్కోరింగ్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా 7 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు నమోదు చేసింది. భారత జట్టుకు సంజు శాంసన్ అద్భుతంగా ఆడుతూ వేగవంతమైన ఇన్నింగ్స్‌తో జట్టుకు బలమైన పునాది వేశాడు. తర్వాత లక్ష్యాన్ని చేధించేందుకు దిగిన ఇంగ్లండ్ జట్టు కూడా గట్టి పోరాటం చేసింది. జేకబ్ బెథెల్ శతకంతో మ్యాచ్‌ను రసవత్తరంగా మార్చినా, చివర్లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి విజయాన్ని సాధించారు.
హార్దిక్ పాండ్యా కీలక సమయంలో వికెట్లు తీసి జట్టుకు పెద్ద సహకారం అందించాడు. ఈ విజయంతో భారత్ ఫైనల్‌లోకి ప్రవేశించి కప్ గెలవడానికి మరొక అడుగు దూరంలో నిలిచింది.