అమరావతి: జనవరి,7(తెలుగు న్యూస్ పవర్) ఉపాధ్యాయులను కలవరపెడుతున్న టెట్ పరీక్ష రద్దు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే న్యాయపోరాటం ప్రారంభించాలని జాక్టో డిమాండ్ చేసింది. జాక్టో నాయకులు, కత్తి నరసింహారెడ్డి, నక్క వెంకటేశ్వర్లు, లంకపల్లి సాయి శ్రీనివాస్, బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2010కి ముందు సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులను, టెట్ పరీక్ష నుంచి మినహాయించడానికి, న్యాయపరమైన, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుని ఈ పరీక్షలు రద్దు చేయాలని 7 ప్రముఖ సంఘాల ఐక్యవేదిక జాక్టో తరపున డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా చేపట్టిన “మార్చ్ టు పార్లమెంట్” విజయవంతం చేయాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. టెట్ విషయం తీవ్ర ఆందోళనకు గురవుతున్న ఉపాధ్యాయులకు, భరోసా ఇవ్వాల విజ్ఞప్తి చేశారు. పాఠశాలలో ప్రస్తుతం అమల్లో ఉన్న జాతీయ విద్యా విధానం, కార్పొరేట్లకు, ప్రపంచీకరణ సార్ సందర్భంగా, వలస పాలకులకు ఉపయోగపడే విధంగా ఉందని ఆరోపించారు. విద్య, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన దాని, అయితే, స్థానిక అస్తిత్వం లేకుండా, కేంద్ర ప్రభుత్వమే నిరంకుసత్వంగా, రాష్ట్ర విద్యపై, కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చేనెల 5న అఖిల భారత, జాక్టో పిలుపుమేరకు ఉపాధ్యాయులు, భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.