Telugu News Power

డిజిటల్ టెక్నాలజీతో 8వ జనగణన.

కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ నాగరాజు

అమరావతి: ఫిబ్రవరి,20(తెలుగు న్యూస్ పవర్) భారతదేశంలో పదేళ్లకు ఒకసారి జరిగే జనగణన కరోనా తదితర కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. భారతదేశంలో జరిగే 16వ జనాభా లెక్కల గణన ఇది. స్వాతంత్ర భారతదేశంలో 8వ జనగణన. వచ్చే ఏడాది ఈ జనగణన ప్రారంభం కానుంది. అన్ని రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ లోకూడా జనాభా లెక్కల సేకరణకు ముందస్తు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కే. విజయానంద్ స్థానిక సచివాలయంలో ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారుల(కలెక్టర్ల)తో శుక్రవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయానంద్, సెన్సస్ అధికారులకు పలు విషయాలు వెల్లడించారు. డిప్యూటీ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, డాక్టర్ వి వి ఎల్ ఎన్ శర్మ, మాట్లాడుతూ, వచ్చే ఏడాది జరిగే జనాభా లెక్కల సేకరణ పూర్తిగా ఆధునిక సాంకేతిక ఉపయోగించుకొని, డిజిటల్ మాద్యమంలో జరుగుతుందని వెల్లడించారు. ఈ ప్రక్రియను రెండు దశలుగా విభజించారు. మొదటి దశలో, ఇళ్ల జాబితా, హౌసింగ్ సెన్సెస్ తయారు చేస్తారు. రెండవ దశలో, జనాభా వివరాలు సేకరిస్తారు. మొబైల్ యాప్, వెబ్ పోర్టల్ ద్వారా ప్రజలకు స్వయంగా జనగణనలో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. జనాభా లెక్కలు దేశ అభివృద్ధికి ప్రణాళికలు రచించడానికి ప్రామాణికంగా నిలుస్తాయన్నారు. విధాన నిర్ణయాలు తీసుకోవడానికి,వనరుల కేటాయింపుకు ఈ లెక్కలు ఎంతో కీలకమైనవని పేర్కొన్నారు. జనగణనలో పాల్గొంటున్న ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు ఖచ్చితమైన డేటా సేకరించడానికి సమర్థవంతమైన శిక్షణ ఇస్తారని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్, చదలవాడ నాగరాణి, అన్ని శాఖల సమన్వయంతో, ఖచ్చితమైన జనాభా లెక్కలు సేకరించడానికి కంకణబద్దులై ఉన్నట్టు తెలిపారు.

జనాభా లెక్కల సేకరణ–2027పై రాష్ట్రస్థాయి సమావేశం
అమరావతి రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం జనాభా లెక్కల సేకరణ–2027పై ప్రిన్సిపల్ సెన్సస్ అధికారులైన జిల్లా కలెక్టర్లతో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగరాణి పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ గారు జనాభా లెక్కల సేకరణ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. డిప్యూటీ రిజిష్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా డా. వి.వి.ఎల్.ఎన్. శర్మ గారు మాట్లాడుతూ 2027లో జరగనున్న జనాభా గణన 16వది కాగా, స్వాతంత్ర్యం తరువాత 8వది అని తెలిపారు.
🔹 ఈసారి జనాభా గణన పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించబడనుంది.
🔹 రెండు దశల్లో ప్రక్రియ జరుగుతుంది:
1️⃣ హౌస్ లిస్టింగ్ & హౌసింగ్ సెన్సస్ (HLO)
2️⃣ పాపులేషన్ ఎన్యుమరేషన్ (PE)
🔹 మొబైల్ యాప్ మరియు వెబ్ పోర్టల్ ద్వారా ప్రజలకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ సౌకర్యం కల్పించనున్నారు.
జనాభా గణన డేటా ప్రణాళిక, విధాన రూపకల్పన, వనరుల కేటాయింపులో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. సమర్థవంతమైన శిక్షణతో ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు ఖచ్చితమైన డేటా సేకరణకు కృషి చేయాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గారు అన్ని శాఖల సమన్వయంతో ఖచ్చితమైన జనాభా లెక్కల సేకరణకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.